Friday, April 19, 2024
Friday, April 19, 2024

సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి: రామాంజనేయులు

విశాలాంధ్ర-నంద్యాల: చేతివృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని చేతి వృత్తిదారుల సమాఖ్య ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు పిలుపు నిచ్చారు. సోమవారం చేతివృత్తిదారుల సమాఖ్య నంద్యాల జిల్లా సమితి విస్తృత సమావేశం నంద్యాల నిశాంత్‌ భవన్‌లో సమాఖ్య జిల్లా నాయకులు డి.సుబ్బయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా చేతివృత్తి దారుల సమాఖ్య ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు మాట్లాడుతూ మూడేళ్ల వైసీపీ పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు. 56కుపైగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లలో ఒక్క పైసా కేటాయించకపోవడం దారుణమన్నారు. నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న పథకాలను కోత విధించారన్నారు. చేతి వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలే శరణ్యమన్నారు. చేతి వృత్తుల కార్పొరేషన్లకు తక్షణమే నిధులు కేటాయించి, సబ్సిడీ రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేతివృత్తిదారుల సమాఖ్య అధ్వర్యంలో ఈనెల5న రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ భవన్‌ ఎదుట జరిగే ‘ధర్నా’ చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్‌. రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.బాబా ఫక్రుద్దీన్‌, కర్నూలు జిల్లా కార్యదర్శి ఎం.కారన్న, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రామ్మోహన్‌తో పాటు జిల్లాలోని నాయీ బ్రాహ్మణ, రజక, వడ్డెర, దర్జీ, మేదర వృత్తిదారులు పాల్గొన్నారు. అనంతరం చేతి వృత్తి దారుల సమాఖ్య నంద్యాల జిల్లా 13మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా డీ సుబ్బయ్య, కార్యదర్శిగా ఎం.రామ్మోహన్‌, ఉపాధ్యక్షుడిగా శివ నాగయ్య, సహాయ కార్యదర్శిగా బాబు, కోశాధికారిగా దీనావలిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img