Friday, April 19, 2024
Friday, April 19, 2024

సింగర్‌ మంగ్లీకి కీలక పదవిని.. కట్టబెట్టిన వైసీపీ ప్రభుత్వం

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ సలహాదారుగా నియమితురాలయింది సింగర్‌ మంగ్లీ. మార్చి నెలలో ఆమెను సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కానీ అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఆమె నాలుగు రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. రెండేళ్ళ పాటు ఈ పదవిలో మంగ్లీ ఉండనుంది. లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఆమె తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా సుంకిడి అనే గ్రామంలో జన్మించారు. కానీ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కర్ణాటక మ్యూజిక్‌ లో డిప్లొమా పూర్తి చేసిన ఆమె తర్వాత మ్యూజిక్‌ టీచర్‌ అవ్వాలనుకుంది.అయితే హైదరాబాద్‌ వచ్చి యాంకర్‌ గా మొదలుపెట్టి తర్వాత సింగర్‌ గా మారింది. సినిమా సాంగ్స్‌ లో కూడా ఆమె తనదైన స్టైల్‌ లో ముందుకు వెళ్ళింది. శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో శైలజ రెడ్డి అల్లుడు చూడు అనే సాంగ్‌ తో తన సింగింగ్‌ కెరీర్‌ ప్రారంభించిన ఆమె తర్వాత అనేక సినిమాపాటలు పాడారు. ఆమె పాడిన రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న అనే సాంగ్‌ ఆమెకు బాగా ప్లస్‌ అయింది. ఇప్పుడు ఈ పదవి రావడానికి కూడా అదే కారణం అని తెలుస్తోంది. ఆ పాట తరువాత ఆమెను వైసీపీ బాగా ఆదరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img