Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సీఎం జగన్‌కు ముద్రగడ పద్మనాభం మరో లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. ఎవరి ప్రమేయం లేకుండా దళితులు వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానంలో ఆలోచన చేయాలని.. కొన్ని పదవులలోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలన్నారు. దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళితే బాగుంటుందన్నారు. కొందరు దళితులు ఇతర వర్గాలు నివసించే ప్రాంతాలలో ఉండడం వల్ల లక్షలాది రూపాయలు నిధులు వారి పేరుతో ఖర్చు చేయడం వల్ల ఎక్కువ జనాభా నష్టపోతున్నారన్నారు. ముద్రగడ లేఖలో ‘రాష్ట్రంలో దళితులకు మెరుగైన పద్దతులలో పదవులు నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానంలో ఆలోచన చేయమని కోరుచున్నానండి. అన్ని పదవులు కాకపోయినా పంచాయితి స్థాయిలో ప్రెసిడెంట్‌, వార్డు మెంబర్లుతో వారికి పూర్తి స్వేచ్చ ఇప్పించాలండి. జనాభా 300 నుండి పై బడిన దళితవాడలను గుర్తించి పంచాయితీలుగా తీర్చినప్పుడు వారికి వచ్చిన గ్రాంట్లు అన్నియు వారి వీధులలోనే ఖర్చు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందండి’ అన్నారు.‘4 లేక 5 దళిత కుటుంబాలు వారు, ఇతర వర్షాల వారు నివశించే వీధులలో ఉండటం వల్ల దళితులకు సంబంధించిన లక్షలాది రూపాయలు గ్రాంటు 4 లేక 5 కుటుంబాలు నివసించేవారి పేరుతో ఖర్చు చేయడం వల్ల ఎక్కువ జనాబా ఉన్నవారు నష్ట పోతున్నారని వారి అభిప్రాయమండి. దయచేసి తమరు దృష్టిపెట్టి రాష్టంలో ఉన్న దళిత నాయకులతో సమావేశం మీ ఆధ్వర్యంలో పెట్టి వారి అమూల్యమైన సలహాలు తీసుకుని ముందుకు వెళితే బాగా ఉంటుందని అనిపిస్తుందండి. 26-12-2022న కాపుల కోసం రాసింది.. ఈ ఉత్తరం కూదా పూర్తిగా వ్యక్తిగతమండి’ అంటూ లేఖ రాశారు. ముద్రగడ కొద్దిరోజుల క్రితం కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img