Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌

నీతి అయోగ్‌ బృందం గన్నవరం మండలం వీరపనేనిగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా వీరపనేనిగూడెంలో సేంద్రీయ వ్యవసాయ వరిపంటను నీతి అయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ బృందం పరిశీలించింది. సేంద్రీయ వ్యవసాయం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.వీరపనేని గూడెం గ్రామస్తులు సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే మరింతమంది ఈ వ్యవసాయం వైపు అడుగులేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.అక్కడి నుంచి నీతి ఆయోగ్‌ బృందం విజయవాడకు బయల్దేరింది.తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నీతి అయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.కాగా రెండు రోజుల పాటు ఏపీలో జరిగే వివిధ కార్యక్రమాలలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌, నీతి ఆయోగ్‌ బృందం పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img