Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీఎం జగన్‌ మంకుపట్టు వీడాలి

. అమరావతినే రాజధానిగా స్పష్టమైన ప్రకటన చేయాలి
. రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇకనైనా మంకుపట్టు వీడాలని, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 1200 రోజులకు చేరింది. చరిత్రలో కనీవినీ ఎరుగని ఉద్యమమైంది. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేతగా జగన్‌మోహన్‌ రెడ్డి గత ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టారు. అధికారంలోకి రాగానే మాట మార్చి, మడం తిప్పి, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అమరావతినే రాజధానిగా అభివృద్ధిపరచాలని హైకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయకుండా సుప్రీంకోర్టు కెక్కింది. సుప్రీంకోర్టు కూడా జగన్‌ సర్కారుకు అనుకూలంగా స్టే ఇవ్వలేదు. ఉగాది తదుపరి విశాఖ నుంచి పాలన సాగిస్తామన్న జగన్‌కు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖలో చుక్కెదురైంది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఘోర పరాజయం చెందారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆ ప్రకటనలో రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 1200 రోజులు పూర్తయిన అమరావతి ఉద్యమానికి సంఫీుభావం తెలిపేందుకు మార్చి 31న రైతులు నిర్వహించే కార్యక్రమాల్లో సీపీఐ భాగస్వామ్యం కానున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img