Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సీపీఎస్‌ ఉద్యోగుల యాన్యుటీ మినహాయింపు పరిమితి పెంపు: ఎస్‌టీయూ

ఆదినారాయణ

విశాలాంధ్ర – గాజువాక : ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం 56 గ్రామాలకు చెందిన నిర్వాసితులు 26 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయ త్నాలను చూస్తూ ఊరుకోమని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి.ఆదినారాయణ స్పష్టం చేసారు. స్టీల్‌ ప్లాంట్‌ బీసీ గేట్‌ వద్ద బుధవారం ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు యాజమాన్యం కొంత మంది నిర్వాసితులకు మాత్రమే ప్లాంట్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, మరో 8 వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 22, 23 తేదీలలో ఢల్లీి లో అన్ని రాజకీయ పక్షాల ఫ్లోర్‌ లీడర్లతో పాటు ఆర్థిక శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజా, కార్మిక ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పులి వెంకట రమణా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో నాయకులు గాజువాక వై.సి.పి ఇంచార్జ్‌ తిప్పల దేవన్‌ రెడ్డి, గంధం వెంకట్రావు, ఎల్లేటి శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు, గణపతి రెడ్డి, మంత్రిమూర్తి, శంకర్‌ నారాయణ, మార్డుపూడి పరదేశి, గంట్యాడ గురుమూర్తి, నమ్మి అప్పారావు, జెర్రిపోతుల ముత్యాలు, బలిరెడ్డి సత్యనారాయణ, గొందేసి సత్యారావు, మహిళా నేతలు పల్లా చిన్నతల్లి, ఉషశ్రీ, రోజారాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img