Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సుబాబు రైతు కోసం దశలవారీ ఉద్యమం

రైతు నాయకుల స్పష్టీకరణ

విశాలాంధ్రనందిగామ : సుబాబుల్‌, జామాయిల్‌ సాగు రైతులు పదేళ్లుగా పేపరు కంపెనీ దళారుల చేతిలో మోసాలకు గురవు తున్నారని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ విమర్శించారు. సుబాబుల్‌, జామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర, సమస్యల పరిష్కారం కోసం సుబా బుల్‌జామాయిల్‌ రైతుల జిల్లా సదస్సు శుక్రవారం కృష్ణాజిల్లా నందిగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జరిగింది. ముఖ్య అతిథిగా మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొ న్నారు. సదస్సుకు అధ్యక్షవర్గంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి, రైతు సంఘం నాయకులు చుండూరు వెంకట సుబ్బారావు, సీపీఎం నాయకులు చనుమోలు సైదులు వ్యవ హరించారు. కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతులను కంపెనీల దయా దాక్షిణ్యాలకు వదిలేయడంతో అందిన కాడికి దోచుకుం టున్నారని ఆరోపించారు. సుబాబుల్‌ టన్ను 4200 రూపాయలకు కొనుగోలు చేయాలని మంత్రుల సమక్షంలో కుదిరిన రాతపూర్వక ఒప్పందాన్ని కంపెనీలు అమలు చేయడం లేదన్నారు. దీనికి తోడు వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వడంతో రోజుకో ధర నిర్ణయించుకుంటూ రైతులను నిలువునా దోచు కుంటున్నారని ఆరోపించారు. రూ.4200లలో కర్ర కటింగ్‌, ట్రాక్టర్‌ కిరాయి పోగా రైతులకు రూ.3400 రావాల్సి ఉండగా రూ.1300లకు మించి రావటం లేదన్నారు. సుబాబులు, జామాయిల్‌ రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమం చేపట్టడానికి రాజకీయాలకతీంగా రైతులు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందిస్తామని, ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు గ్రామ సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు, 9న తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. రైతుసంఘం అధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను నిర్వీర్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని ఏడు నెలల నుండి రైతులు ఢల్లీిలో ఆందోళన చేస్తుంటే రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. సుబాబులు, జామాయిల్‌ పంటలకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నందిగామ ఎన్నికల ప్రచారంలో సుబాబులు టన్నుకు రూ.5వేలు ఇప్పిస్తానని ఇచ్చిన హమీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సుబాబులు కొనుగోళ్లలో ట్రేడర్స్‌ వ్యవస్థను రద్ధు చేసి ఏఎంసీల ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. గత ప్రభుత్వం జీఓ 143 ద్వారా సుబాబులు రైతులను ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఏఎంసీల ద్వారా సుబాబులు కర్ర కొనుగోలు చేయటం ద్వారా రైతులకు న్యాయం జరిగిందన్నారు. సుబాబులు పంటను కనీసం రూ.1300కు కొనే దిక్కులేదన్నారు. సుబాబుల పంటకూ కనీస గిట్టుబాటు ధరపై రైతుసంఘాల అధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. నందిగామ మాజీ ఎంఎల్‌ఏ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ సుబాబుల ధర కోసం నందిగామలో పాదయాత్ర చేపడతామని తెలిపారు. సదస్సులో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్నీడి యలమందరావు, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు, సామాజిక వన రైతుసంఘం కార్యదర్శి వి.హనుమారెడ్డి, నాయకులు పొన్నం నరసింహారావు, పొల్నీడి నాగభూషణం, కట్టా చామంతి, చుండూరు రంగారావు, వీరారెడ్డి, రాజగోపాలరెడ్డి, పీవీ ఆంజనేయులు, కోట వీరబాబు, పాలేటి సతీష్‌, రేపాల మోహనరావు, గాదెల రామారావు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల నాయకులు గోపాల్‌, ఖాసిం, కర్రి వెంకటేశ్వరరావు, హస్సేన్‌, జాన్‌ సైదా సేవలందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img