Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సూర్యగ్రహణం ప్రభావం : 12గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

నేడు సూర్య గ్రహణం కారణంగా ఆలయాలన్నీ మూతపడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం కూడా మూతపడిరది. నేడు సూర్యగ్రహణం మధ్యాహ్నం ప్రారంభం కానుండటంతో, గ్రహణానికి ఆరు గంటల ముందు నుండే సూతక కాలం గా పరిగణించి ఆలయాలను మూసివేస్తారు. ఈ క్రమంలోనే నేడు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. ఉదయం ఎనిమిది గంటల 11నిమిషాలకు మూతపడిరది. ఈరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయం మూసివేత కొనసాగుతుంది. అంటే మొత్తం 12 గంటల పాటు ఆలయాన్ని అధికారులు మూసి వేస్తున్నారు. అక్టోబర్‌ 24న సిఫార్సు లేఖలను అనుమతించలేదు. అక్టోబర్‌ 25 మంగళవారం నేడు సూర్య గ్రహణం కారణంగా ఆలయం మూసివేత కొనసాగుతుండడంతో టీటీడీ అధికారులు బ్రేక్‌ దర్శనాలను నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img