Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సొంత పార్టీ నాయకుల దుకాణాల మీద దాడి చేయడం అమానుషం- డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌

విశాలాంధ్ర బ్యూరో `నెల్లూరు : నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్వద్దవై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ నాయకుడు, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సయ్యద్‌ మునవర్‌ కు చెందిన కలర్స్‌ ప్లాజా దుకాణాన్ని మునిసిపల్‌ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమన్నారు. అని నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరు నగర నియజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకుడు, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సయ్యద్‌ మునవర్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వెంట నడిచినటువంటి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. ఇటీవల జరిగిన వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన సందర్భంగా కేకు కట్‌ చేసి, పేద మహిళలకు చీరల పంపిణీ చేసిన పాపానికి మునిసిపల్‌ అధికారులు మునవర్‌ దుకాణాన్ని కూల్చివేయడానికి రావడం జరిగిందన్నారు. విషయం తెలుసుకుని వెంటనే నేను మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి వచ్చి అధికారులను అడిగితే మాకుఎవరో ఫోన్‌ చేశారుఅనిపొంతనలేనిసమాధానాలుచెప్పి అందుకనే వచ్చాము అని వెంటనే అధికారులు వెళ్లిపోవడం జరిగిందన్నారు. అయితే తిరిగి అర్ధరాత్రి 1గం ప్రాంతంలో దొంగల్లాగావచ్చి కాలువ పూడికతీత కోసం మునవర్‌ దుకాణం మెట్లను పగులగొట్టామని అధికారులన్నారని ఆయన చెప్పారు. కాలువ పూడికలు తీయాలని అనుకుంటే అన్ని దుకాణాల ముందు పగులగొట్టాలని అలా కాకుండా మునవర్‌ దుకాణం ముందే ఎందుకు పగులగొట్టారని ప్రశ్నించారు. మైనారిటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, 10సం జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తిని ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. పక్కనే 25అడుగుల రోడ్డులో 7 అంతస్థుల భవనం నిర్మాణం జరిగుతుంటే దానిమీద అనేక ఫిర్యాదులువస్తే కార్పొరేషన్‌ అధికారులు మాత్రం కళ్ళుమూసుకునిపోయి ఉన్నాయన్నారు. మునవర్‌ కి చెందినటువంటి ఈ కొట్టు ఆక్రమణ కాదు,దురాక్రమణ కాదు, ప్రభుత్వఆస్తి కాదు,చిన్నపాటి లోపం కూడలేదన్నారు. అయితే కేవలం జగనన్న జన్మదిన రోజున కేకు కట్‌ చేసి,పేదమహిళలకు చీరలుపంపిణీచేసినపాపానికిమంచిబహుమానం మునిసిపల్‌ అధికారులు ఇచ్చానన్నారు వీటన్నింటికి కారణం వెనుక ఉండిఎవరునడిపించారోమీఅందరికితెలుసన్నారు. మాజోలుకొచ్చినఅధికారిఎవ్వరుకుడా ఇప్పటి వరకు బాగుపడలేదన్నారు. పార్టీ కోసం పని చేసిన ఏ నాయకుల మీద, కార్యకర్తల మీద అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు వారికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను అని అన్నారు. మేమందరం రాజన్న భక్తులం జగనన్న సైనికులం జగ్మోహన్‌ రెడ్డి కోసం ప్రాణాలను సైతం అర్పించేదానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి జన్మభూమి కమిటీల మీటింగులలో మా మీద కేసులు, కౌన్సిల్‌ మీటింగ్‌ లో కేసులు అలాగే రౌడి షీట్లు అన్ని భరించుకుంటే మా కష్టంతో గద్దెనెక్కిన కొంత మందిదుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు. జగనన్న దయచేసి నెల్లూరు నగరంలో ఒకసారి ఎంజరుగుతుందో తెలుసుకొని పార్టీ కోసం కష్టం చేస్తున్న వారికి అన్యాయం జరగకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిమీద కఠినమైన చర్యలు తీసుకోవాలని జగనన్నని వేడుకుంటున్న అని అన్నారు. పార్టీ కోసం కష్టం చేసి కార్యక్రమాలు చేసి పార్టీ పరంగా అన్ని నష్టపోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దామవరపు రాజశేఖర్‌, ఇంతియాజ్‌, గోగుల నాగరాజు. నాయకులు మునవర్‌, హాజీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img