Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

స్కూళ్లలోనూ కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలి

: సీఎం జగన్‌
పాఠశాలల్లోనూ కరోనా నిర్థారణ పరీక్షల నిర్వహణ చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. పాఠశాలల్లో కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో కరోనా నిర్థారణ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని, ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించేలా చూడాలని జగన్‌ సూచించారు. థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఉంటుందని చెప్పారు.కోవిడ్‌ రూల్స్‌ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను 90 రోజుల్లోగా భర్తీ చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img