Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హామీలు నెరవేర్చకుంటే ఆందోళన తప్పదు

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు

విశాలాంధ్ర కర్నూలు కలెక్టరేట్‌ : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకుంటే ఉద్యోగులు ఆందోళన బాట పడతామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆస్కార్‌ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన సంఘం కర్నూలు జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రభుత్వ అధికారులే కారణమని ఆవేదన చెందారు. సీపీస్‌ రద్దు, కాట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని, ఉద్యోగుల పీఆర్సీ, డీఏ విడుదల చేస్తామని, పెండిరగ్‌ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని నేటికీ హామీలు నెరవేరలేదన్నారు. సచివాలయం ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి ఇప్పుడు అర్హత పరీక్షలు రాయాల్సిందేనని ప్రకటించడం ప్రభుత్వానికి సరైంది కాదన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ నీటి ముప్పు బాధితులను ఆదుకొని వారికి ఉద్యోగాలు కల్పించడంతోపాటు గతంలో ఇచ్చిన ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలపైన తక్షణమే మంత్రివర్గ ఉప సంఘం వేసి చర్చించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల కర్నూలు జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎంసీ నరసింహులు, కె.సుదర్శన్‌ రెడ్డి, సహధ్యక్షునిగా కె.సత్య నారాయణ, కోశాధికారిగా డి.శ్రీనివా మూర్తి, కార్యనిర్వహణ కార్యదర్శిగా కె.రాజ్‌ కుమార్‌, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసులు, శ్రీనివాసులు, గొల్ల జ్యోతి, నవాజ్‌, హరిచంద్ర రెడ్డి, గురుమూర్తి, ప్రసాద్‌ కంప, భరత్‌, సంయుక్త కార్యదర్శులుగా ఎ.శాషావలి, షేక్‌ ఖాశీం బాబు, సయ్యద్‌ అబ్దుల్‌ రసూల్‌, ఎ.ఖాదర్‌ బాష, కురువ మల్లయ్య, మల్లికార్జున రావులను ఎన్నుకున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు వెల్లడిరచారు. అంతకు ముందు బి.క్యాంపులోని బీ/బీ57 నెంబర్‌ గల క్వార్టర్స్‌ నందు ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయాన్ని ఆస్కార్‌ రావు జిల్లా నాయకులు, ఉద్యోగులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img