Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

హేతుబద్ధత లేని జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం : నక్కా ఆనందబాబు

హేతుబద్ధత లేని జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని మాజీమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అసంబద్ధంగా ఉందని అన్నారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు ఉండాలని చెప్పారు. రాజకీయ స్వలాభం కోసం జిల్లాల ఏర్పాటు ఉండకూడదని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ప్రాతిపదికన జిల్లా ఏర్పాటు తగదన్నారు. తెనాలి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వేమూరు ప్రజలకు తెనాలితో అవినాభావ సంబంధం ఉందని, తెనాలి డివిజన్‌లోని వేమూరును బాపట్లలో కలపడం సరికాదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img