Monday, October 3, 2022
Monday, October 3, 2022

1 నుంచి కడప జిల్లాలో సీఎం పర్యటన

సెప్టెంబర్‌ 1 నుంచి 3వ తేదీ వరకు సీఎం జగన్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి వర్ధంతితో సహా.. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని ప్రభుత్వం వర్గాలు వెల్లడిరచాయి. సీఎం జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ వీ.విజయరామరాజు పేర్కొన్నారు. ఇడుపుల పాయలోని వైఎస్సార్‌ ఘాట్‌, గెస్ట్‌ హౌస్‌, నెమళ్ల పార్కు తదితర ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. సీఎం పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్ణయించిన మేరకే అధికారులను, ప్రజాప్రతినిధులను అనుమతించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img