Monday, December 5, 2022
Monday, December 5, 2022

11న విశాఖ వస్తున్న ప్రధాని మోదీ

ఈ నెల 12న పలు పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న విశాఖపట్నం వస్తున్నారు. ఈ నెల 12న విశాఖలో పలు పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మోదీ విశాఖ రానుండడం ఇది మూడోసారి. తాజా పర్యటన సందర్భంగా, ప్రధానికి ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి మోదీ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకుంటారు. రాత్రికి ఐఎన్‌ఎస్‌ చోళాలో బస చేస్తారు. మరుసటి రోజు ఆంధ్రా యూనివర్సిటీ మైదానానికి చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ దాదాపు 14 ప్రాజెక్టులకు వర్చువల్‌ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు మోదీ పర్యటన ఖరారైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img