Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

11న కలెక్టరేట్ల వద్ద ధర్నా

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో ప్రజలపై పడుతున్న భారాలకు నిరసనగా ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వెల్లడిరచారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, మంతెన సీతారాంతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణల అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయన్నారు. విద్యుత్‌, పెట్రోలు, డీజిల్‌, కొత్తగా బస్సు ఛార్జీలు బాదుడుకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో చెత్తపన్ను, ఆస్తి విలువ పేరుతో అదనపు భారాలు పెరిగాయని చెప్పారు. కొత్తగా జీఎస్టీ బాదుడు పెరిగిందని, రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాన్ని కేంద్రం తన్నుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు నోరెత్తకపోవడం సరికాదన్నారు. గతంలో ఒడిస్సాలో బీజేపీ తరుపున రెండుసార్లు మంత్రిగా ఉండి, గిరిజనులను పోలీ సులు కాల్చిచంపినా నోరెత్తలేదని, అటవీ హక్కులు కాలరాస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన హోదా, విభజన హామీలు నెరవేర్చినందుకు మద్దతు ఇస్తున్నారా? అనేదీ వైసీపీ స్పష్టం చేయాలన్నారు. పార్టీలకతీతంగా హోదా కావాలని కోరుతుంటే, వైసీపీ మాత్రం దానిపై ప్రశ్నించకుండా, మద్దతుఇవ్వడం ఏమిటని నిలదీశారు. టీడీపీ సైతం దీనిపై ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే బీజేపీకి మద్దతు ఇవ్వొద్దని కోరారు. స్వాతంత్రోద్యమ ద్రోహి బీజేపీ అని విమర్శించారు. రాష్ట్రంలో వలంటీర్లతో వైసీపీ నాయకులు ప్రజలను భయపెడుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపేస్తున్నారని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img