Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

13న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతాం : శైలజానాథ్‌

ఒక్కరోజు కూడా ప్రజలకు మేలు చేసే ఆలోచన వైసీపీ ప్రభుత్వం చేయలేదని, రోజు రోజుకు ప్రజలపై రకరకాలుగా పన్నుల రూపంలో దాడులు చేస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాధ్‌ విమర్శించారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులకు విద్యుత్‌ మీటర్లు పెడుతున్న దుర్మార్గపు ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ నెల 13 తేదీన ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. పెంచిన విద్యుత్‌ చార్జీలు, ప్రజలను పిండే పన్నులను వెనక్కి తీసుకోవాలని శైలజనాధ్‌ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img