Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే డివిజ‌న్లో 19 రైళ్లు ర‌ద్దు, 26 రైళ్లు దారి మ‌ళ్లింపు

హైద‌రాబాద్ ఉ ఒడిశా కొరమండల్ రైలు ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. రైలు ప్రమాదంపై మాట్లాడుతూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. .తెలుగు ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాద ఘటన తీవ్రంగా ఉండడంతో ఒడిశా వైపు వెళ్లే 19 రైళ్లను రద్దు చేశామని, 26 రైళ్లను దారి మళ్లించామన్నారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులకు డబ్బులు రిఫండ్ చేశామన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రైల్వే సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారని.. అక్కడ పనులు పూర్తవగానే తిరిగి రైళ్లు యధావిధిగా నడుస్తాయని రాకేష్ వెల్లడించారు. అలాగే ప్రమాదానికి గురైన కోరమండల్ రైలులో స్పల్పంగా గాయపడిన, సురక్షితంగా ఉన్న ప్రయాణీకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక రైలును చెన్నై వరకు నడుపుతున్నామని వెల్లడించారు.. ఇప్పటికే ఈ రైలు నేటి ఉదయం 250 మంది ప్రయాణీకులతో బయలుదేరిందని తెలిపారు.. చెన్నైకు ఈ రైలు రేపు ఉదయం 9 గంటలకు చేరుకుంటుందని చెప్పారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img