Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

2024 వరకు మన రాజధాని హైదరాబాదే.. : మంత్రి బొత్స

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున వాడీవేడీగా సాగుతున్నాయి. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తుండగా.. టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. . ‘2024 వరకు మన రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అయితే అమరావతి, హైదరాబాద్‌ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే’ అని బొత్స వ్యాఖ్యానించారు. అయితే బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img