Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

31వ రోజు కొనసాగుతున్న రైతుల మహాపాదయాత్ర

అమరావతి రాజధాని సాధన కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం 31వ రోజు కొనసాగుతోంది. ఇవాళ తణుకు మండలం, వేల్పూరు నుంచి పాదయాత్ర సాగుతోంది. తణుకు నియోజకవర్గం నుంచి నిడదవోలు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.
కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో నేటితో పాదయాత్ర ముగియనుంది. ఈరోజు వేల్పూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర వీరభద్రపురం, మండపాక, పైడిపర్రులో భోజన విరామం అనంతరం తణుకు చేరుకుంటుంది. పట్టణంలోని ఆర్వోబీ, వేంకటేశ్వర సెంటర్‌, నరేంద్ర సెంటర్‌, కేశవస్వామి గుడి సెంటర్‌, ఉండ్రాజవరం జంక్షన్‌, ఉండ్రాజవరం రోడ్డులోని పాలంగి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించి ఉండ్రాజవరం వద్ద ముగుస్తుంది. వీరికి రాత్రి బస కానూరులోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు.వర్షం అవరోధం సృష్టించినా… అధికార పార్టీ కవ్వింపులకు పాల్పడినా ఒకే ధ్యేయంతో పాదయాత్ర ముందుకు సాగింది. రైతుల పాదయాత్రకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ నుంచి తణుకు నియోజకవర్గం వేల్పూరు వరకు మంగళవారం 30వ రోజు 15 కిలోమీటర్ల యాత్ర సాగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img