Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

కలుషిత ప్రసాదం తినడంతో 50 మందికి అస్వస్థత

కేబీపురం మండలం ఆరె గ్రామంలో ఘటన
తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారం తినడంతో 50కిపైగా మంది అస్వస్థతకు గురయ్యారు. కేబీపురం మండలం ఆరె గ్రామంలో రెండు రోజుల క్రితం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని నిర్వాహకులు గ్రామస్థులకు పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న గ్రామస్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొందరు ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, ఇంకా 30 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img