టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ఢల్లీికి వెళుతున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ సమావేశం జరగనుంది.. అందులో బాబు పాల్గొననున్నారు. కేంద్రంఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి వెళుతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి దేశంలోని దాదాపుగా అన్ని పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కు సైతం ఆహ్వానం అందింది. ఆ రోజున ఢల్లీిలో సమావేశానికి హాజరు కావటంతో పాటుగా ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతోనూ భేటీ అయ్యేందుకు సీఎం జగన్ అప్పాయింట్ మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. కాగా, ఆ రోజే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీంతో..ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌ను కూడా జగన్ కలిసే అవకాశం ఉంది.