Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి

: సీఎం జగన్‌
90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై సీఎం జగన్‌ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణ సామాగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఇళ్లు కట్టి ఇచ్చే పనులు అక్టోబర్‌ 25 నుంచి ప్రారంభం కావాలన్నారు. టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష సందర్భంగా.. ఫేజ్‌`1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే ప్లాట్లు పథకాన్ని కూడా సీఎం సమీక్షించారు. విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధంచేసి అమలు తేదీలు ప్రకటించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img