Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

చలసాని జీవితం అనుసరణీయం

వర్ధంతి సభలో వక్తలు

విశాలాంధ్ర – విశాఖ: ప్రజా ఉద్యమాలలో మార్క్సిస్టు మేధావి చలసాని ప్రసాద్‌ బలమైన ముద్రవేశారని వక్తలు కొనియాడారు. నాయకత్వం పద ప్రయోగాన్ని ఆయన అంగీకరించే వారు కాదనీ బాధ్యులు అనే పదాన్ని ప్రయోగించే వారని చెప్పారు. ఆయన జీవితం ఆచరణీయమన్నారు. మార్క్సిస్టు మేధావి చలసాని ప్రసాద్‌ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పౌర ప్రజా సంఘాల వేదిక ఆదివారం విశాఖలో ‘ఫాసిజం ముంచుకొస్తున్న సందర్భం’ అనే అంశంపై సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు పౌర, ప్రజాసంఘాల వేదిక సమన్వయకర్త పి. చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించారు. వర్తమాన సందర్భం – చలసాని ప్రాసంగికత అంశంపై రచయిత్రి మల్లీశ్వరి మాట్లాడుతూ మహిళలను ఫాసిస్టు మూకలుగా తయారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతం మాయాజాలంలో వారిని ఉపయోగించుకుంటున్నారని, భక్తి ద్వారా వారిని ఫాసిజం వైపు నడిపిస్తున్నారని చెప్పారు. చలసాని రాజకీయ – సాహిత్య జీవితం అంశంపై విరసం నాయకులు సీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ తూర్పు ప్రాంత ప్రజా ఉద్యమాల్లో చలసాని బలమైన ముద్రవేశారని అన్నారు. నాయకత్వం అనే పదాన్ని చలసాని వ్యతిరేకించే వారిని, ఆ పదంతో అధికారమనే భావజాలం వస్తుందని అభిప్రాయపడే వారని, బాధ్యులు అనే పదాన్ని ఉపయోగించేవారని చెప్పారు.
ఈ సదస్సులో భారతదేశ ప్రజాస్వామ్యం – భవిష్యత్తు అంశంపై మార్క్సిస్ట్టు అధ్యయన కేంద్రం కన్వీనర్‌ జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా ఉద్యమాలు రావాలని, దీనికి పౌర సమాజం ముందుకు రావాలని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి జరుగుతోందని అన్నారు. కర్నాటక ఎన్నికలతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమన్న విశ్వాసం ఏర్పడిరదని చెప్పారు. అక్కడి పౌర సమాజం 140 నియోజకవర్గాల్లో క్రింది స్థాయిలో పనిచేసి బీజేపీి వ్యతిరేక ఓటు చీలకుండా కృషి చేసిందని తెలిపారు. ప్రశ్నించే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో కీలకమైనదని, దాన్ని ప్రధాని మోదీ అంగీకరించకుండా.. అమెరికాలో జరిగిన విలేకరుల సమావేశంలో భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్పడాన్ని ఖండిరచారు. ప్రశ్నించే వారిని వివిధ మార్గాల్లో అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కార్యకర్తలని నిర్బంధానికి గురి చేస్తున్నారని చెప్పారు. కోర్టులు ఈ విషయములో పాలకవర్గానికి సానుకూలంగా వ్యవహరించటం విచారకరమని అన్నారు. దేశంలో మీడియాని రిలయన్స్‌, అదానీలు తమ గుప్పెట్లో పెట్టుకున్నాయని తెలిపారు.
ఫాసిజం ముందుకొస్తున్న సందర్భం – చలసాని అంశంపై వీక్షణం సంపాదకుడు ఎన్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఫాసిజం ప్రమాదం గురించి 90 ల్లోనే చలసాని ప్రసాద్‌ మరోసారి గుర్తు చేశారని చెప్పారు. 20, 21 వ శతాబ్దాల ఫాసిజాన్ని చలసాని ప్రసాద్‌ ప్రత్యక్షంగా పరిశీలించారని అన్నారు. ఫాసిజాన్ని ఓడిరచేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని సిద్ధం చేయాలని అన్నారు. ఫాసిజం ఒక సాంస్కృతిక, రాజకీయ ఆచారంగా ముంచుకొస్తోందని, పాలకవర్గాల చేతుల్లో ఒక ఆయుధంగా ఉందని అన్నారు. ఫాసిజం అందరి ఆమోదంతో వస్తుందేమోనన్న ఆందోళన ఉందని చెప్పారు. మణిపూర్‌ లోని ఘటనలతో ఫాసిజం వికృత రూపం బయటపడిరదని, అక్కడ ఫాసింజం పతాక స్థాయిలో కనిపించిందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img