Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి ప్రమాదం: ఎమ్మెల్యే సహా పలువురు సురక్షితం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ కి ఇవాళ ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో వంశీ కాన్వాయ్ లోని వాహనాలు ఢీకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో శనివారంనాడు తృటిలో ప్రమాదం తప్పింది.సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ కి ప్రమాదం చోటు చేసుకుంది. వంశీ కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఎమ్మెల్యే వంశీ సహా కాన్వాయ్ లోని వారంతా సురక్షితంగా ఉన్నారు.ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాన్వాయ్ లోని ఇతర వాహనాలను తీసుకొని ఎమ్మెల్యే వంశీ హైద్రాబాద్ వెళ్లిపోయారు.ఇవాళ ఉదయం విజయవాడ నుండి వల్లభనేని వంశీ హైద్రాబాద్ కు బయలుదేరారు. అయితే చివ్వెంల మండలం ఖాసీంపేట వద్దకు చేరుకోగానే వంశీ కాన్వాయ్ లోని వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుండి వంశీ సహా కాన్వాయ్ లోని వారంతా సురక్షితంగా బయట పడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img