రేషన్ షాపుల్లో సార్టెక్స్ బియ్యం స్థానంలో ఫోర్టిఫైడ్ బియ్యం అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా రూ.330కోట్లు ఆదా అవుతుందని సమాచారం. అలాగే సీఎం పేషీ, సీఎంవో అధికారుల పేషీల్లో 71 పోస్టులు, మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.