Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నాకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది..: కేశినేని నాని

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ పరిధిలో గొట్టంగాళ్ల కోసం కూడా తాను పనిచేస్తున్నానని.. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయన్నారు. అయోధ్య రామరెడ్డి తాను మంచి వాడిని కాబట్టే అలా మాట్లాడారని.. వేరే పార్టీ ఆఫర్లు మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తనకు 100 శాతం మండితే అపుడు దానిపై ఆలోచిస్తానని.. అమిత్ షాతో చంద్రబాబు భేటీ ఎందుకో తనకు తెలియదన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు.. రావాలని చంద్రబాబు ఏపీ ఫోన్ చేస్తే వెళ్లానన్నారు. ఢిల్లీలో పార్టీ అధినేత చంద్రబాబును బాధ్యతగా వెళ్లి కలిశానన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు పై స్పందించే స్థాయి తనది కాదన్నారు. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా గెలిపిస్తారనే మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. తనను మున్సిపల్ ఎన్నికల సమయంలో గొట్టం గాడు, చెప్పుతో కొడతా అన్నారని.. అలాంటి గొట్టం గాళ్ల ఫోటోలు కూడా కేశినేని భవన్ బిల్డింగ్ ఫోటో మీద వేశామన్నారు. అలాంటి గొట్టం గాళ్ల గెలుపు కోసం కూడా పని చేస్తున్నానని.. పార్టీ పేరుతో ఉన్న కేశినేని భవన్ నుంచి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవ చేస్తున్నానని.. తాను ఇక్కడ నుంచి పని చేస్తున్నా.. ఇంకా తాను ఎందుకు స్పందించాలన్నారు.తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనని.. తనకు ఎటువంటి పదవులూ లేవన్నారు. అభివృద్ధి విషయంలో ‌తాను పార్టీలు చూడబోనని.. అందరినీ కలుపుకుని ప్రజల కోసం పని‌చేస్తానని వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో తన మీద ప్రచారం చేశారని తాను స్పందించబోనని.. తాను ఏదీ చేసినా మెచ్చుకునే వాళ్లు, తిట్టుకునే వాళ్లు ఉంటారన్నారు. తాను రాజకీయాల్లో ఏం చేస్తాననే దాని పై తనకు స్పష్టత ఉందన్నారు. సోషల్ మీడియాలో వాళ్లు ఏదో ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు.
ప్రజాప్రతినిధిగా గెలిచాక ప్రాంతం, ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తానన్నారు నాని. తన గురించి ఎవరేమి అనుకున్నా పట్టించుకోనని.. ప్రజలు కోరుకుంటే పార్టీ సీటు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా గెలుస్తాను అన్నాను. తన గెలుపోటమలు అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారని కామెంట్ చేశారు. విజయవాడ ప్రజలంతా తనతో చాలా సౌకర్యంగా ఉన్నారన్నారు. టీడీపీ మహానాడుకు తనకు ఆహ్వానం లేదని.. అక్కడ రామ్మోహన్ నాయుడికి తప్ప ఇతర ఎంపీలకు పని లేదన్నారు.విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసు పెట్టి.. ఎంపీగా తనకు ఆహ్వానం లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళ్లారని.. పార్టీ కార్యాలయం పెట్టిన వ్యక్తి.. పొలిట్ బ్యూరో సభ్యుడైన నేత తనను పిలవలేదన్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌ల పేరుతో హడావుడి చేసే వాళ్లు గొట్టంగాళ్ల అని కామెంట్ చేశారు. ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన లేదు.. చిర్రెత్తితే దాని గురించి ఆలోచిస్తాను అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img