Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఎంతమంది పవన్‌లు వచ్చినా లాభం లేదు.. : మంత్రి రోజా

ఏపీలో మరోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు మంత్రి రోజా. ఇరిటేషన్ స్టార్ట్ పవన్ కళ్యాణ్, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబుకు ఇన్స్పిరేషన్ స్టార్ జగనన్న కాలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరంటూ రోజా ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రజలు మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కసితో ఉన్నారన్నారు. రికార్డుల సృష్టించాలన్నా.. ఆయన రికార్డులను బ్రేక్ చేయాలన్నా అయన తప్ప వేరే ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు.ఇవాళ చిత్తూరు జిల్లా వాసులకు శుభదినమని.. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుట విజయ డైరీకి జగనన్న ప్రాణం పోస్తున్న రోజన్నారు. అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలకు వెలుగు నింపిన విధంగా.. చిత్తూరు జిల్లా పాడి రైతుల జీవితాల్లో జగనన్న వెలుగు నింపుతున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో పుట్టి, చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే అయిన చంద్రబాబు సిగ్గుపడాల్సిన రోజన్నారు.అలాగే రాష్ట్రంలో అర్హత ఉండి పథకాలు రాని వారిని జల్లెడ పట్టి జగనన్న సురక్ష ద్వారా లబ్ధి చేకూర్చడం ప్రధాన ఉద్దేశమన్నారు మంత్రి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img