Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సూర్యలంకలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు

  • కలెక్టర్ విజయ కృష్ణన్
    బాపట్ల – విశాలాంధ్ర : జిల్లాలో సూర్యలంక సముద్రతీరంలో ఎకో టూరిజంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ వెల్లడించారు. మంగళవారం బాపట్ల సూర్యలంక తీర ప్రాంతంలో ఆలీవ్ రిడ్లి సముద్ర తాబేళ్లు ను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్,జిల్లా ఎస్.పి వకుల్ జిందాల్ సముద్రంలోకి వదిలారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టూరిస్టులు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఆలీవ్ రిడ్లి సముద్ర తాబేళ్లు గుడ్లను కనబడితే పారవేయకుండా అటవీశాఖ అధికారులకు అప్పగించాలన్నారు. సముద్రలో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లకుండా ఆలీవ్ రిడ్లి సముద్ర తాబేళ్లు ను సముద్రంలోకి వదలడం జరుగుతుందన్నారు. సూర్యలంక సముద్ర తీరంలో ఆలీవ్ రిడ్లి సముద్ర తాబేళ్లును వదిలి పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో సముద్ర తీరంలో అలీవ్ రిడ్లి సముద్ర తాబేళ్లు గుడ్లు పొదగడానికి 7 ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి మహేష్,సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఆర్.ఎస్.చౌదరి, తహశీల్దార్ కవిత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img