ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం ఈ రోజు కలవనుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలోని ముఖ్య నాయకులు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తో ఈ మేరకు భేటీ కానున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. చెరుకుపల్లిలో బాలుడు అమర్నాథ్ హత్య సహా పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపైనా ఫిర్యాదు చేయనున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా గవర్నర్ ఆదేశాలివ్వాలని టీడీపీ నేతల బృందం కోరనుందని సమాచారం.