Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పోరాట ఫలితమే సంక్షేమ బోర్డు

1996 నాటి చట్టాన్ని అమలు చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథరెడ్డి

విశాలాంధ్ర-తిరుపతి: ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా దేశంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి హరినాథ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలోని ఎంఆర్‌ పల్లి, సీతమ్మ నగర్‌లో భవన నిర్మాణ కార్మిక సంఘం నేత ఈ. ఏసు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరినాథ్‌ రెడ్డి మాట్లాడుతూ సీపీఐ అనుబంధ సంఘంగా ఉన్న ఏఐటీయూసీ పోరాటాల కారణంగా ఐదు మందితో కూడిన కమిటీ నిర్ణయం మేరకు 1996 భవన నిర్మాణ కార్మిక చట్టం తయారైందని తెలిపారు. 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు రూ.3 వేలు పెన్షన్‌ మంజూరు చేయాలని, పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం రూపాయలు ఆరోగ్యంతో మరణిస్తే రూ.60 వేలు, దహన క్రియలకు రూ.20 వేలు, మెటర్నటీ బెనిఫిట్‌ కింద రెండు కాన్పులకు రూ.40 వేలు, కార్మికులుకు పెళ్లి కానుకగా రూ.20 వేలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మండి పడ్డారు . సీపీఐ జిల్లా కార్యదర్శి పి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ ఆగస్టు 14న జరిగే తిరుపతి జిల్లా ప్రథమ మహాసభ బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల హక్కుల సాధనకై జరిగే పోరాటానికి సీపీఐ నిత్యం అండగా ఉంటుందన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కె.రాధాకృష్ణ, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ శ్రీరాములు మాట్లాడుతూ..2018 నుంచి పెండిరగ్‌లో ఉన్న బకాయిత విడుదలకై, భవన నిర్మాణ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 9వ తేదీ క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తిరుపతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి జె విశ్వనాధ్‌, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్‌డి రవి, నగర కార్యవర్గ సభ్యులు ఎన్‌. శివ, అర్‌.బలరాం, జి.శశి కుమార్‌, వి. ఉదయ్‌ కుమార్‌, ఎపి బాల, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉప్పు హరిబాబు శెట్టిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img