Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్రంలో గాలి వానా బీభత్సం..

రాష్ట్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మేఘావృతమైన ఆకాశం చల్లటి వర్షాన్ని కురిపించింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. తిరుపతి జిల్లాలోని కొరమీను గుంటలో ఈదురుగాలులు బలంగా వీయడంతో పాటు భారీ వర్షం కురిసింది. ఈ గాలివాన దాటికి సుమారు ఇరవై రెకుల ఇళ్లు నేలకూలాయి. రాజమండ్రి భారీ వర్షం కారణంగా టీడీపీ మహానాడుకు అంతరాయం ఏర్పడింది. గాలుల తీవ్రతకు ప్రాంగణంలో ఫ్లెక్సీలు, కటౌట్లు కూలిపడ్డాయి. కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, చిత్తూరు, బైరెడ్డిపల్లి తో పాటు పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ వైర్లు తెగిపడటంతో విద్యుత్‌ సరఫరాకు విఘాతం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ఎండలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం ప్రకాశం జిల్లా కురిచేడులో 45.5, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.2, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 44.8, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో 44.7 అధిక ఉష్ణోగ్రతలు నమెదయ్యాయి. 24 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ద్రోణి ప్రభావంతో సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. పిడుగుల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img