Homeజిల్లాలుఅనంతపురంఅపెక్స్ డయాగ్నొస్టిక్స్ సెంటర్ సీజ్..

అపెక్స్ డయాగ్నొస్టిక్స్ సెంటర్ సీజ్..

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : అనంతపురం నగరంలోని సాయి నగర్ మొదటి క్రాస్ లోని అపెక్స్ డయాగ్నోస్టిక్స్ కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం సీజ్ చేశారు. కాల పరిమితి దాటినా రెన్యువల్ చేసుకోకపోవడంతో గత నెల 29న అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో రెన్యువల్ చేసుకోవాలని కోరినప్పటికీ డయోగ్నస్టిక్ కేంద్రం యాజమాన్యం స్పందించకపోవడంతో గడువు తీరడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డెమో అధికారులు, సిబ్బంది బుధవారం సాయంత్రం ఆ కేంద్రంలోని స్కానింగ్ , సిటీ, ఎమ్మారై యూనిట్లను యాజమాన్యం, రెవిన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. అనంతరం పంచనామ నిర్వహించి యాజమాన్యానికి సీజ్ చేసిన పరికరాల పత్రాన్ని అందజేశారు. పి సి పి ఎన్ డి టి, ఏపీ ఏపీఎంసీఈ చట్టాల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్కులు, డయోగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ యూనిట్లపై చర్యలు తప్పవని డిఎంహెచ్వో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి ఈ. నాగరాజు, డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సునీత, లీగల్ సలహాదారు ఆషారాణి, హెడ్ కానిస్టేబుల్ రమేష్ నాయక్ బృందం, వీఆర్వో సాయి గాయత్రి, , డిప్యూటీ ఆరోగ్య విద్యాధికారి వేణుగోపాల్, విజయ్ భాస్కర్, శ్రీకాంత్, జాఫర్ వలి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు