విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సిద్దయ్య గుట్టకు చెందిన బాల నరసింహులు మృతి చెందారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ ద్వారా ఉచితంగా ఫ్రీజర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. తదుపరి క్రియాశీల సభ్యుడు రవికుమార్ నేత్రదానముకు అంగీకరించడంతో, మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి అనంతపురం కంటి టెక్నీషియన్ రాఘవేంద్ర తో మాట్లాడి నేత్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివై కులాయప్ప ఐ రిటైరబుల్ సెంటర్ అనంతపురం ద్వారా ఐ టెక్నీషియన్ రాఘవేంద్ర అక్కడికి చేరుకొని రెండు నేత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులకు సంస్థ తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు. తదుపరి మృతిని పార్తివ దేహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. తండ్రి నేత్రాలను దానం చేసి ఇద్దరి అందుల జీవితాలలో వెలుగులు నింపుటకు సహకరించిన బాల నరసింహులు, కుటుంబ సభ్యులను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, అధ్యక్షులు శంకర్ నాయుడు, ప్రముఖ రిటైర్డ్ కంటి వైద్యులు సంకారపు నరసింహులు, ఉపాధ్యక్షులు మంజునాథ్, డైరెక్టర్ జ్వాలా నరసింహారెడ్డి పాల్గొన్నారు.
నేత్రదానం చేసిన బాల నరసింహులు
- Advertisement -
RELATED ARTICLES


