విశాలాంధ్ర-గూడూరు: గూడూరు పట్టణంలోని బీరప్ప స్వామి ఆలయంలో మంగళవారం కురువ సంఘం నూతన మండల కమిటీని జిల్లా కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు పర్ల శ్రీనివాసులు, అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె శివన్న ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షులుగా బూడిదపాడు గ్రామానికి చెందిన బంగారు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా కురువ భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా కే. యుగంధర్, సహాయ కార్యదర్శిగా పొన్నకల్ రాముడు, కోశాధికారిగా గజ్జల నడిపి సుంకన్న, ముఖ్య సలహాదారుగా కే. కృష్ణ ఎన్నికయ్యారు. అలాగే కమిటీ సభ్యులుగా జి. కొండయ్య, బి. సురేష్, ఆటో రాముడు, డి. సుంకన్న, కె. నాగమద్దిలేటి తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి కృషి చేస్తూ, కురువ సామాజిక వర్గ ఐక్యతను బలోపేతం చేయడానికి, సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం మండల ముఖ్య సహోదరుడు పెంచికలపాడు కె కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కే రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
కురువ సంఘం మండల అధ్యక్షులుగా బంగారు శ్రీనివాసులు
- Advertisement -
RELATED ARTICLES


