Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 22వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ – గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా నాయకులు

  • సాగుభూములతోనే జీవిత భద్రత -ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే బి శ్రీధర్

విశాలాంధ్ర -బాపట్ల : సాగుభూములు సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిరంతర పోరాటం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జేబీ శ్రీధర్ అన్నారు.బాపట్లలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మీక సంఘం 22వ రాష్ట్ర మహాసభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ ఈనెల 25,26,27 తేదీలలో లో బాపట్ల లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 22వ మహాసభలు జరుగుతున్నాయని రాష్ట్ర మహాసభలకు సంబంధించి జిల్లా నాయకులతో కలసి సిపిఐ పార్టీ కార్యాలయంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామ్రేడ్ జెల్లి విల్సన్ మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు, కామ్రేడ్ డాక్టర్ కే నారాయణ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి, కామ్రేడ్ గుల్జార్ సింగ్ గోరియా భారతీయ భేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ కే రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కామ్రేడ్ ఆవుల శేఖర్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కామ్రేడ్ ఆర్ .వెంకట్రావు కొత్తపట్నం ఎంపీటీసీ రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు, కామ్రేడ్ జేబీ శ్రీధర్ ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ తన్నీరు సింగరకొండ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి సిపిఐ జిల్లా కార్యదర్శి, తదితరులు ప్రత్యేక అతిధులుగా పాల్గొననున్నారని జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరమాల ప్రకాష్ బాబు సిపిఐ చీరాల నియోజకవర్గ సభ్యులు, బక్క వెంకట రామకృష్ణారెడ్డి సిపిఐ బాపట్ల టౌన్ సెక్రటరీ, మామిడి బత్తుల అశోక్ ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు, ఆసోది కృష్ణారెడ్డి ఏ ఐ వై ఎఫ్ జిల్లా నాయకులు, చిరమాల శ్రీను ఏఐ వైఎఫ్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img