- Advertisement -
- జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ చిత్రం విజయవంతం కావాలని బైక్ ర్యాలీని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వేలాదిగా తరలివచ్చి బైక్ ర్యాలీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని జై జనసేన అన్న నినాదాలు మార్మోగాయి. హరిహర వీరమల్లు చిత్రం ఈనెల 24 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సందర్భంగా అత్యంత విజయవంతం కావాలని తెలిపారు. అంతేకాకుండా పట్టణంలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీ కార్యాలయం నందు అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దగ్గర నుండి గాంధీ నగర్ మీదుగా కదిరి గేట్, తేరు బజార్, అక్కడి నుండి రేగాటిపల్లి రోడ్ సాయిబాబా టెంపుల్ వరకు తిరిగి రంగా థియేటర్ దాకా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం మీడియా ముఖంగా మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ ను ధర్మవరంలో ఒకరోజు ముందే అభిమానులతో కలిసి జరుపుకున్నామని ఈ సినిమా ఘన విజయం సాధించటం తద్యమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో మొట్టమొదటిసారిగా హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మొత్తం రిలీజ్ కానున్నదన్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తుందని స్పష్టం చేశారు. ఈ బైక్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు తదితరులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.


