Tuesday, May 13, 2025
Home Blog Page 293

లోక్ స‌భ‌లో జమిలి బిల్లు

కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్ స‌భలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ఆ వెంటనే దానిని సంయుక్త పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.

రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు!

రేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. వారు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులు దరఖాస్తు చేసుకున్న బెయిలు పిటిషన్ నిన్న విచారణకు వచ్చినప్పటికీ తిరిగి 19వ తేదీకి వాయిదా పడింది. కాగా, మాయమైన బియ్యం విలువకు సంబంధించి జరిమానాతో కలిపి డబ్బులు కట్టాలన్న అధికారుల నోటీసుకు స్పందించిన నాని కుటుంబం తొలి విడతలో ఈ నెల 13న కోటి రూపాయల విలువైన మూడు డీడీలు సమర్పించింది. నిన్న మరో రూ. 70 లక్షల డీడీలు ఇచ్చారు. మొత్తంగా రెండు విడతల్లో కలిపి ఇప్పటి వరకు రూ. 1.7 కోట్ల డీడీలు అధికారులకు అందించారు.

జరిమానా చెల్లించే అవకాశం ఇవ్వడం ద్వారా పేర్ని నాని కుటుంబానికి అధికారులు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం కల్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, మొత్తం 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు చెబుతున్నా, ఆ సంఖ్య అంతకుమించే ఉంటుందని అంటున్నారు. వాస్తవంగా ఎన్ని బస్తాలు మాయమై ఉంటాయన్న విషయంలో నేడు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రేషన్ బియ్యం మాయమైన కేసులో ఈ నెల 10న గోదాము యజమాని జయసుధ, మేనేజర్ మానస్ తేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. జయసుధ ఈ నెల 13న బెయిలు కోసం దరఖాస్తు చేయగా, విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న జయసుధ విదేశాలకు పారిపోకుండా పోలీసులు తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. కాగా, మాయమైన బియ్యం విలువకు సంబంధించి పేర్ని నాని కుటుంబం రూ. 1.7 కోట్లు చెల్లించిన నేపథ్యంలో నాని నిన్న అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. తన నివాసంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేశ్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తదితరులతో సమావేశమయ్యారు.

డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో చుక్కెదురు

అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు భారీ షాకిచ్చింది. హష్ మనీ కేసులో ఇప్పటికే ట్రంప్ ను దోషిగా తేల్చగా.. ఈ కేసు నుంచి రక్షణ కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. అధ్యక్షులకు కేవలం అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లోనే రక్షణ ఉంటుంది తప్ప ఇలాంటి కేసుల్లో కాదని స్పష్టం చేసింది. హష్ మనీ కేసును కొట్టేయలేమని జడ్జి జువాన్‌ మర్చన్‌ తేల్చిచెప్పారు. హష్ మనీ కేసులో ట్రంప్ పై విచారణ జరిపిన మన్ హట్టన్ కోర్టు నవంబర్ లో ఆయనను దోషిగా తేల్చింది. పోర్న్ స్టార్ కు డబ్బులు ఇచ్చిన విషయం నిజమేనని నిర్ధారించింది. అయితే, ఈ లోగా ఎన్నికలు జరగడం, ట్రంప్ గెలవడంతో కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ట్రంప్ కు శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. ఈ క్రమంలోనే క్రిమినల్‌ విచారణ ఎదుర్కోకుండా అధ్యక్షుడికి రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు తాజాగా ఆయనకు రక్షణ కల్పించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టు ఈ కేసును కొట్టివేయకుంటే శిక్ష అభియోగాలు ఎదుర్కొంటూ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు.

హష్‌ మనీ కేసు..
డొనాల్డ్ ట్రంప్ గతంలో స్టార్మీ డానియల్స్ అనే పోర్న్ స్టార్ తో సన్నిహితంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో స్టార్మీ డానియల్స్ నోరు విప్పకుండా ఉండేందుకు 1.30 లక్షల డాలర్లను ట్రంప్ ముట్టుజెప్పారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనినే హష్ మనీ అంటున్నారు. ఎన్నికల ప్రచారం కోసం సేకరించిన విరాళాల సొమ్మును ఇలా దుర్వినియోగం చేశారని, దీనికోసం తప్పుడు రికార్డులు సృష్టించారని ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు మొత్తం 34 అంశాల్లో ట్రంప్ పై నేరారోపణలు నమోదయ్యాయి.

మాలలు మహాగర్జన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

0

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : గుంటూరులో జరిగిన మాలల మహా గర్జన సభను విజయవంతం చేసినందుకు మాల సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బొగ్గవరపు బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉప్పులేటి దేవి ప్రసాద్ నాయకత్వంలో జరిగిన మహాగర్జన సభకు రాష్ట్రంలో ఉన్న అనేక గ్రామాల నుండి స్వచ్ఛందంగా కదలి వచ్చిన సోదరులందరికీ జై భీమ్ తెలుపుతున్నట్లు బాబురావు పేర్కొన్నారు.

డాక్టర్ మల్లిపూడి కి జీవన సాఫల్య పురస్కారం

0

విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ఆ గ్రామీణ పశు వైద్య నిపుణునికి మూగజీవుల పట్ల వల్లమాలిన ప్రేమ. వాటి బాధల్ని తొలగించే కృషిలో ఎంతో నేర్పుని చూపే పశు వైద్య నిపుణుని ప్రసిద్ధిని పొందిన ఆయన ఇప్పటివరకు 35 పైగా పురస్కారాలు పొందారు. తాజాగా పురస్కారాల ఖాతాలో మరో అరుదైన మరో ఉత్తమ పురస్కారం వచ్చి చేరింది. ఆయన మరెవరో కాదు మండల కేంద్రం ఉంగుటూరుకి చెందిన పశు వైద్య నిపుణుడు, లైవ్ స్టాక్ అధికారి డాక్టర్ మల్లిపూడి చిన బాబు రావు. ఈ నెల 15న హైదరాబాద్ కి చెందిన బెస్ట్ ఆర్ట్స్ ఆకాడమీ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ నెల 15న పుచ్చలపల్లి సుందరయ్య కళానికేతన్ లో మల్లిపూడి ప్రముఖుల చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్న మల్లిపూడిని స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత డాక్టర్ బాబురావు మాట్లాడుతూ.. ఈ పురస్కారం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

జైలును సంస్కృతి మార్పుకు కేంద్రంగా మార్చండి.. భగవాన్ భాయ్

విశాలాంధ్ర ధర్మవరం:: జైలును సంస్కృతి మార్పుకు కేంద్రంగా మార్చాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రహ్మకుమార్ భగవాన్ భాయ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సబ్ జైల్లో రాజస్థాన్లోని మౌంట్ అబూ నుండి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం నుండి బ్రహ్మకుమారు భగవాన్ భాయి ఆధ్యాత్మిక పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది జైలు కాదు అని సంస్కరణోద్యమము అని,మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఇందులో మీరు ఉండడం జరిగిందని తెలిపారు. పగ తీర్చుకునే బదులు మనల్ని మనం మార్చుకోవాలని తెలిపారు. జీవితములో ఎప్పుడూ కూడా మంచి, దృఢమైన సంకల్పం, ఇతరులకు సేవ చేయడం లాంటి కార్యక్రమాలే శాశ్వతం అని తెలిపారు. మీ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మంచి జీవితాన్ని గడుపుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి, దయ, క్షమాపణ, ఇతరులకు సేవ చేయడం, ఇతరులను ఆదుకోవడం లాంటి కు అలవాటు పడాలని తెలిపారు. మనం మంచి వాటికే అలవాటు పడాలని చెడును పూర్తిగా తొలగించాలని తెలిపారు. మనిషిలోని దుర్గుణాలు దుర్మార్గాలు మనల్ని పేదలుగా మార్చుతాయని తెలిపారు. జీవితంలో సద్గుణాలు లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. మానవ జీవితం ఎంతో విలువైనదని తెలిపారు. జీవితములో పనికిరాని పనులు చేసి తమ జీవితాన్ని వృధా చేయకూడదని తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవితములో మంచి మార్పు తీసుకుని రావడానికి మాత్రమే ప్రయత్నం చేయాలని తెలిపారు. ప్రతి మనిషిలో కామం, క్రోదం,లోపం,అనుబంధం, అహంకారం, అసూయ, ద్వేషం మొదలైన చెడులను మన జీవితము నుండి తరిమి కొట్టాలని తెలిపారు. ఖైదీలుగా మీరందరూ కూడా గతాన్ని మరిచిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించాలని తెలిపారు. మీ కుటుంబం కోసం బ్రతకాల్సిన అవసరం ఇప్పుడు ఉందని తెలిపారు. మానవజన్మ మంచి పనులు చేయడానికి మాత్రమే మనము ఉన్నామని చెడు పనులు ఎటువంటి పరిస్థితుల్లో చేయరాదని తెలిపారు. అనంతరం సబ్ జైలు సూపర్డెంట్ బ్రహ్మారెడ్డి ఇటువంటి కార్యక్రమాలకు మా సభ్యులకు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలుపుతూ, మా ఖైదీలలో మంచి మార్పు తీసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని తెలుపుతూ ప్రత్యేకంగా ప్రజాపిత బ్రహ్మకుమారి సంఘమునకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రాజయోగ సేవ కేంద్రం కోఆర్డినేటర్ రాధా మెహందీ, జైలు సిబ్బంది శివరామకృష్ణ, శివ నాగేశ్వర్, శ్రీనివాసులు బాయి, సుధాకర్ బాయ్, బి కే క్రాంతి భాయ్, బి కే రాజు భాయ్, అశోక్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో సిబ్బంది, పాఠకుల నడుమ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసిన ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వేణి 1953 అక్టోబర్ 1న ఏర్పడిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగమే నేడు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, గంగాధర్, శివమ్మ, సత్యనారాయణ, అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో;; పట్టణములోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరు రమణయ్య ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 72వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులతోపాటు అనుబంధ సంఘాలు, సభ్యులందరూ పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పిన్ను అశోక్ కోశాధికారి తబ్జులు శ్రీనివాసులు ఆలయ కమిటీ చైర్మన్ బిన్ను ప్రసాద్ వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పూలమాల రూప రాగిణి కోశాధికారి నల్లపేట మంజు సంయుక్త, యువజన సంఘం, నగర సంకీర్తన బృందం, వాసవి భజన మండలి తదితరులు పాల్గొన్నారు.

అవోపా ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు;; పట్టణంలోని ఆర్యవైశ్య అవోపా ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు అవోపాయించార్జ్ అన్న లక్ష్మీనారాయణ, పట్టణ అవోపా అధ్యక్షులు డాక్టర్ సీబా నగేష్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వాసవి సర్కిల్ వద్దగల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల హారాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగమే ఇప్పుడు తెలుగు రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ వర్ధంతి వేడుకలను నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవోపా కార్యదర్శి కలవర కృష్ణకిషోర్ కోశాధికారి పనిరాజ్, సీబా సురేష్ గుప్తా సాయి కృష్ణ, ప్రసాద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ధర్మవరం కబడి క్రీడాకారులు బి. నవ్య, ఎన్. ఉష ఎంపిక కావడం జరిగిందని ఆర్డిటి కబడ్డీ కోచ్ పృద్వి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపికైన ఈ క్రీడాకారులు ధర్మవరం ఆర్డిటి క్రీడా మైదానంలో శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ శిక్షణలో వారు మంచి ప్రతిభను కనపరచడంతో ఉమ్మడి జిల్లా తరఫున గుంతకల్ రైల్వే క్రీడా మైదానంలో జరిగిన జూనియర్ కబాడీ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటడం జరిగిందని తెలిపారు. ఎంపికైన వీరు రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు గాను ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం కోచ్ పృద్వి తోపాటు ఆర్డిటి సిబ్బంది, పలువురు కోతులు కూడా అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఈ సి ఆర్ ఆర్ సరస్వతి నిలయం- కళాజ్యోతిలో పద్మశ్రీ స్వర్గీయ ఘంటసాల వారి జయంతి వేడుకలను కళాజ్యోతి లో అంగరంగ వైభవంగా కమిటీ వారు నిర్వహించారు. సభ అధ్యక్షులుగా కళాజ్యోతి అధ్యక్షులు కుంటిమల నారాయణ, నిర్వహణగా కళాజ్యోతి కార్యదర్శి బాలకొండ రామకృష్ణ నడుమ జరిగింది. ముఖ్య అతిథిగా ధర్మవరం కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఎస్ సమీవుల్ల పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ జయంతి వేడుకలు కళాజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతపురం, ధర్మవరం కళాకారు లైన హరిబాబు, భాలం శీన, వజుదుల్లా,బండారు మురళి, డాక్టర్ రవి కుమార్, శోభారాణి ,రాజేశ్వరి ఘంటసాల పాటల కచేరి అందరినీ ఆకట్టుకుంది. ప్రతి గానం అభిమానుల్ని ఎంతో ఉత్తేజపరిచింది. ఈ కార్యక్రమం దాదాపు మూడు గంటల వరకు నిర్వహించారు. అభిమానులు తమకు తోచిన నగదును కూడా గాయకులకు అందజేశారు. ఈ ఘంటసాల జయంతి వేడుకలు ప్రతి ఒక్కరిని ముద్దుల్ని చేస్తూ, ఎంతో సంతోషాన్ని కలిగించాయని అక్కడి ప్రేక్షకులు, అభిమానులు వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కళా జ్యోతిలో జరగడం ధర్మవరం పట్టణానికి కీర్తి తెచ్చిపెట్టిందని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాజ్యోతి ఉపాధ్యక్షులు సింగనమల రామకృష్ణ,డైరెక్టర్లు రాంప్రసాద్, మధుసూదన్, పళ్లెం వేణుగోపాల్ ,జగ్గా వేణుగోపాల్, రమేష్ బాబు తోపాటు అధిక సంఖ్యలో అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

ధర్మవరం యువ కవికి ఘన సత్కారం

విశాలాంధ్ర ధర్మవరం:; అనంతపురం ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాయలసీమ మహాకవి సమ్మేళనంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం యువ కవి రచయిత బీరే వేణుగోపాల్ “ప్రజా కవి వేమనపై” వినిపించిన కవిత అందరినీ అలరించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు వేణుగోపాల్ ని అభినందించి ఘనంగా సత్కరించారు. గ్రహీత బీరే వేణుగోపాల్ మాట్లాడుతూ ఇటువంటి అవకాశము తో పాటు నన్ను సత్కరించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవులు అప్పిరెడ్డి, హరినాథ్ రెడ్డి, మల్లెల నరసింహం, జెన్నే ఆనంద్, శాంతి నారాయణ వివిధ జిల్లాల నుండి సాహితీవేత్తలు పాల్గొన్నారు.