Friday, January 17, 2025
Home Blog Page 3

ఇంగ్లీష్ అధ్యాపకునికి ఘన సన్మానం చేసిన పూర్వ విద్యార్థులు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని దాసరి వెంకటేశులు (చిట్టి) గెస్ట్ హౌస్ ప్రాంగణంలో1976-78 సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల సభలో, ఆనాటి ఆంగ్లం అధ్యాపకులు ఎం.సాయినాథ్ ను 30 మంది పూర్వ విద్యార్థులు కలిసి గురువుగారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ధర్మవరానికి సతి సమేతంగా వచ్చిన ధర్మవరంలో నిర్వహిస్తున్న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రావడం జరిగిందని పూర్వ విద్యార్థులు తెలిపారు. తల్లం నారాయణమూర్తి తక్కువ సమయంలో 30 మంది పూర్వ విద్యార్థులను కలపడం జరిగిందని తెలిపారు. తదుపరి పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఉద్వేగానికి లోనయ్యారు. గురువును సత్కరించిన తర్వాత పూర్వ విద్యార్థులందరూ కూడా ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా గురువు సాయినాథ దంపతులు మిక్కిలి ఆనందముతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వయసులో నాకు నా విద్యార్థులు సన్మానం చేయడం జీవితంలో మరుపు రానిదని వారు తెలిపారు. తదుపురి ఆనందంగా గురువుకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో దాసరి చిట్టిని ,తెల్లం నారాయణమూర్తిని తోటి విద్యార్థులు గురు దంపతులు అభినందించారు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్తి కుమార్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా కాలమానని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి రామాంజనేయులు యాదవ్ సమస్యలను మంత్రి దృష్టికి వివరించారు. అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు రెండు నూతనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ప్రొహిబిషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావలసిన బకాయిల్ని ఇవ్వాలని, సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సచివాలయ ఉద్యోగులకు అన్ని రూల్స్ పాటించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జీవో నెంబర్ 423ను వెంటనే రద్దుచేసి, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు మిగిలిన కార్యదర్శుల పని వేళలు కల్పించాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 143 ,32 జీవోలను రద్దు చేయాలని, సురక్షిత వాచ్మెన్ 24/7 పనిచేసే ఆసుపత్రులలో భద్రత కోసం వాచ్మెన్ నియమించాలని, రెగ్యులర్ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని, ఏఎన్ఎంల రీ డిప్లయ్మెంట్ సీనియర్ ఏఎన్ఎములకు తిరిగి ఉప కేంద్రాలకు పంపాలని తెలిపారు. డాక్టర్ల సంఖ్య పెంచాలని, సామాజిక పారామెడికల్ ఆసుపత్రులలో జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్లను పెంచాలని తెలిపారు. మందుల సరఫరా అన్ని రకాల మందులు రసాయనాలు ప్రభుత్వమే సరఫరా చేయాలని వారు తెలిపారు. డాక్టర్లకు ప్రత్యేక బత్యాలు, పోస్ట్మార్టం ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక బత్యాలు ఇవ్వాలన్నారు. కొత్త పిఆర్సీను కమిటీ ప్రమేయం లేకుండా వెంటనే ప్రకటించాలని కోరుతూ 20 అంశాలపై మంత్రితో చర్చించడం జరిగిందని నాయకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆదినారాయణ మల్లికార్జున తాలూకా అధ్యక్షులు సాయి ప్రకాష్-ధర్మవరం, కదిరి తాలూకా అధ్యక్షులు ఫక్రుద్దీన్, మడకశిర తాలూకా అధ్యక్షులు నటరాజ్ యాదవ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి హరిప్రసాద్, ధర్మవరం కార్యదర్శి ఓబులేషు, గ్రామపంచాయతీ విభాగం సభ్యులు సుధాకర్, సుబ్రహ్మణ్యం, వీఆర్ఏ అధ్యక్షులు సుధాకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతోమంది ప్రజలకు సాయం అందిస్తున్నాం

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 మంది అనారోగ్య బాధితులకు చెక్కులు అందించిన ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (ఎంఆర్ఎఫ్) ద్వారా 6 మంది అనారోగ్య బాధితులకు చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల సహాయ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, అనారోగ్య బాధితుల‌కు సహాయం అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. “ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని, ఆపత్కాలంలో వారికి మద్దతుగా నిలవడానికి నిరంతరం సంకల్పబద్ధంగా పనిచేస్తోంది అని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనారోగ్య బాధితులు సహాయం పొందడంపై ప్రాధాన్యత ఇస్తూ, ఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతోమంది ప్రజలకు సాయం అందిస్తున్నాం అని తెలిపారు.

త్వరలో బిజెపిలో చేరుతాను.. వైఎస్ఆర్సిపి నాయకుడు కృష్ణాపురం జమీర్

విశాలాంధ్ర ధర్మవరం ; వైయస్సార్సీపి నాయకుడు కృష్ణాపురం జమీర్ త్వరలో బిజెపిలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్డీఈఓ కార్యాలయంలో గల ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో జమీర్ కుమారుడు సహిన్స అహ్మద్, మాజీ కౌన్సిలర్ వడ్డే నారప్ప ఉన్నారు.

విశాలాంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్

విశాలాంధ్ర. విజయనగరం జిల్లా. రాజాం : మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చేతుల మీదుగా విశాలాంధ్ర జాతీయ దినపత్రిక రాజాం నియోజకవర్గం క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర నియోజకవర్గ ఇన్చార్జ్, రాజాం రిపోర్టర్ దేవిరెడ్డి రామారావు, రాజాం నియోజకవర్గం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సులందరి క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొండ్రు మురళిమోహన్ కి విశాలాంధ్ర నియోజకవర్గ ఇన్చార్జ్ దేవిరెడ్డి రామారావు ధన్యవాదాలు తెలిపారు.

గోకులం… పాడి రైతులకు వరం

తెలుగుదేశం నాయకులు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్తాత్మకంగా చేయట్టిన గోకులం షెడ్డు పథకం పాడి రైతులకు ఒక వరం అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి హరికృష్ణ,తెలుగుదేశం నాయకులు నలమోతు రవీంద్ర,నవులూరి సుబ్బానాయుడు,టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ముళ్ల మూడి మాల్యాద్రి, గట్టమనేని లక్ష్మీ నరసింహం, సోమినేని తిరుమల, అత్తోట వెంకటేశ్వర్లు, బొల్లినేని నరసింహం, నవులూరి రమణయ్య, నవులూరి రాంగోపాల్ అన్నారు.శనివారం మండలంలోని పోకూరు గ్రామంలో గట్టమనేని రమాదేవి కుటుంబానికి ప్రభుత్వం కేటాహించిన గోకులం షెడ్డు ను ఏపీడీ బాబూరావు, ఏపీఓ ఉమా మహేష్,టెక్నీకల్ అసిస్టెంట్ మెట్టల అశోక్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ గత ఇదేళ్లలో వైసీపీప్రభుత్వం రైతులకు, పాడి రైతులకు ఉపయోగకరమైన ఒక్క మంచి పనికూడా చేయలేదని, నాడు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు పక్కన పెట్టారని అన్నారు. గోకులం షెడ్డు నిర్మాణాల వలన శుభ్రత పెరిగి, పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాల దిగుబడి పెరుగుతుందని అన్నారు.ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలి

కంప్యూటర్, ప్రింటర్ వితరణ
విశాలాంధ్ర తనకల్లు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలోని చదువుకొని ఉన్నత స్థానాలకు చేరాలని మేమందరం ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నామని 2004-05 పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. 20 సంవత్సరాల తర్వాత అందరూ కలవడం చాలా సంతోషంగా ఉందని మనం చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కంప్యూటర్ తో పాటు ప్రింటర్ వితరణగా ఇచ్చామన్నారు. అందరూ కలవడంతో రెండు రోజుల ముందే పండుగ వాతావరణం ఏర్పడిందని పలువురు అభిప్రాయపడ్డారు

సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం శుభవార్త..పెండింగ్ బిల్లులు జమ చేస్తున్న ప్రభుత్వం

సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం శుభవార్త.పెండింగ్ బిల్లులు జమ చేస్తున్న ప్రభుత్వం
సంక్రాంతి పండుగ వేళ వివిధ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేసేందుకు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, పోలీసులు ఇలా అన్ని వర్గాలకు ఊరట కలిగించేలా పెండింగ్ బకాయిలు, బిల్లులు విడుదల చేయాలని ఆదేశించారు. సుమారు రూ.6,700 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పెండింగ్ బకాయిలు, నిధులు విడుదల జరుగుతోంది. నిన్న ఆదివారం సెలవు రోజైనప్పటికీ.. నిధుల విడుదలకు ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం సాయంత్రంలోగా బకాయిల నిధులను అకౌంట్లలోకి జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేస్తూ ఉండటంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ప్రకటన రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగులకు సుమారు రూ.1300 కోట్ల వరకూ బకాయిల నిధులు విడుదల కానున్నాయని అధికారులు చెప్తున్నారు. సోమవారం సాయంత్రానికి మొత్తం బిల్లులు జమచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు ఇటీవల ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల జీపీఎఫ్ పెండింగ్ బకాయిలు రూ.519 కోట్లు, పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు రూ.214 కోట్లు, సీపీఎస్ బకాయిలు రూ.300 కోట్లు, టీడీఎస్ పెండింగ్ బకాయిలు రూ.265 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడేలా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేస్తున్నారు. అలాగే 26 వేల మంది కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా రూ.10 లక్షలలోపు బకాయిలు చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నిర్ణయం ప్రకారం చిన్న కాంట్రాక్టర్లకు రూ.586 కోట్లు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.500 కోట్లు, అమరావతి కౌలు రైతులకు రూ.241 కోట్లు, చిరు వ్యాపారులకు రూ.100 కోట్లు చొప్పున పెండింగ్ బకాయిలు విడుదల చేస్తున్నారు.

తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం

ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని ఓ లడ్డూ కౌంటర్ లో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. 47వ కౌంటర్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో, భక్తులు భయంతో కౌంటర్ నుంచి బయటకు పరుగెత్తారు. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సిబ్బంది అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదంలో పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు.

మీ ఆశలు, ఆకాంక్షలు తీర్చేందుకు ఎప్పుడూ మీ వెంటే ఉంటా.. చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు.ు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.