Home Blog Page 305

తిడితే ఊరుకునేది లేదు… : కేటీఆర్

అన్న ఎన్టీఆర్‌ను, ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్‌లను చూశామని, కానీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హామీల గురించి అడిగితే తిడుతున్నారని, కానీ ఇంతమంది ముఖ్యమంత్రులను మనం చూసినా వారెవరూ ఇలా మాట్లాడలేదని అన్నారు.భూపాలపల్లి, పరకాలలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేయనని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అసలు ఆయన రద్దు చేయడానికి, జిల్లాను ఆయన చేశాడా అని ప్రశ్నించారు. జిల్లాను రద్దు చేస్తే భూపాలపల్లి ప్రజలు వీపు చింతపండు చేస్తారని కేటీఆర్ అన్నారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఁనీ టైమ్ అంతా రెండేళ్లే. ఆ తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది. ఆ తర్వాత నువ్వు పాతాళంలో దాక్కున్నా వదిలి పెట్టం, పొట్టోడా. కేసీఆర్‌తో పాటు మా కార్యకర్తలను అంటే ఊరుకునేది లేదు అని అన్నారు. తిడితే తనను, ఇతర నాయకులను తిట్టుకోవచ్చని, కానీ కేసీఆర్‌ను, బీఆర్ఎస్ కార్యకర్తలను తిడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఎంతమంది దేవుళ్లు ఉంటే అంతమంది దేవుళ్లను మొక్కుకున్నా అధికారంలోకి వచ్చాక వదిలి పెట్టేది లేదని అన్నారు. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదని, లాగుల తొండల్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పాలన పక్కకు పెట్టి కుంభకోణాలకు తెరలేపారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని విమర్శించారు.

సింగరేణిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బావమరిది కలిసి దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రజలను ఆ పార్టీ నాయకులు ముంచుతారని హెచ్చరించారు. రూ.4 వేల పెన్షన్, తులం బంగారం, రైతుబంధు పెంపు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే హామీలు అమలవుతాయని ఓటర్లకు సూచించారు.

ఏపీలో త్వరలో నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేశ్

రాష్ట్రంలో త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు నంది అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద బోధిసిరి బోటులో నిర్వహించిన ‘కృష్ణాతీరం కవితాహారం్ణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కళాకారులకు ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు కూడా అందజేస్తామని తెలిపారు. ఇక, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహాకవి తిక్కన విగ్రహం ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే చర్చించామని, త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు ఈతరం కవులు సమర్పించిన కవితా హారతిగా ఈ కార్యక్రమం నిలిచిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 51 మంది కవులు కవితలు వినిపించడంతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.

ఫలితాలే ముఖ్యం…

సీఎం అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో కీలక సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది. సీఎస్ కె.విజయానంద్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పల్లె పండగ కార్యక్రమం కింద గత ఏడాది రూ.2,500 కోట్లు మంజూరు చేస్తే, ఇప్పుడు 2.0 కింద రూ.5,700 కోట్లు, అడివితల్లి బాటకు రూ.1,005 కోట్లు, సాస్కికి రూ.2,123 కోట్లు.. మొత్తం రూ.11,328 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు.జలజీవన్ మిషన్ కింద కేంద్ర, రాష్ట్ర షేర్లతో పనులు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే రూ.10 వేల కోట్ల పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఉన్న తక్కువ వనరులను ఉపయోగించుకొని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాని సహాయ సహకారాలు, ముఖ్యమంత్రి అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రతి రూపాయి క్షేత్రస్థాయిలో కనిపించాలని… ప్రాజెక్టులు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉదాసీనత డిప్యూటీ సీఎం ఉంటుందన్నారు.ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్‌లు రీచ్ కావలంటే చాలా వరకూ ఎక్స్యూజెస్ కనిపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి, తాను అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకుంటున్నామని.. అందుకే క్షేత్ర స్థాయిలో ఫలితాలు రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధన కోసం పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖల పురోగతిపై సమీక్షించనున్నారు. 2026-27లో కేంద్ర ప్రాయోజిత పథకాల కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా అవేర్ సిస్టమ్, పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతికతల వినియోగంపై సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలపై సీఎం సమీక్ష చేపట్టనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా పాల్గొన్నారు.

అమెరికా టీ-20 ప్రపంచకప్‌ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు

వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్‌ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కీలక అడుగు వేశాడు.టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్‌తో జరిగిన పోరులో అమెరికా (యుఎస్‌ఏ) జట్టు తరఫున అతడు మైదానంలోకి దిగాడు.చిన్నతనం నుంచే క్రికెట్‌పై అపారమైన ఆసక్తి కలిగిన సాయితేజ, చదువుతో పాటు హైదరాబాద్‌లోని వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ఆటను మెరుగుపరుచుకున్నాడు.

స్వగ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆనందం
2022లో కేవలం 18 ఏళ్ల వయసులోనే యుఎస్‌ఏ జాతీయ జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన సాయితేజ, ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచకప్‌ పోటీల్లో అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.శనివారం జరిగిన టీ-20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌తో తలపడుతూ అమెరికా జట్టులో ఆడిన ఆయన ప్రదర్శనపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.నంద్యాల జిల్లా యువకుడు అమెరికా దేశం తరఫున ప్రపంచకప్‌ వేదికపై ఆడుతుండటంపై స్వగ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు..

అమిత్ షాతో భేటీ కానున్న సీఎం

రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినకు వెళుతున్నారు. ఈ సాయంత్రం 7.20 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరుతారు. రాత్రి 9.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 1-జన్ పథ్ నివాసంలో ఆయన బస చేస్తారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కీలక కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ ఉన్న బకాయిల విడుదల, పోలవరం పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై చంద్రబాబు చర్చించనున్నారు.

ఈ నెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక, ఇతర అంశాలను కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లనున్నారు. అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి బయల్డేరి 8 గంటలకు విజయవాడ చేరుకుంటారు.

అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 24 వేల కోళ్ల మృతి

ఆందోళన వద్దు, జాగ్రత్తలు పాటించాలన్న నిపుణులు
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సదుం మండలంలోని మూడు గ్రామాల్లో వేలాది కోళ్లు అంతుచిక్కని రీతిలో మరణించడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 24 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ పరిణామంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. సదుం మండలంలోని పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో గత కొన్ని రోజులుగా కోళ్లు భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. దీంతో అనుమానం వచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మరణించిన కోళ్ల నుంచి నమూనాలను సేకరించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ పరీక్షల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అమ్మగారిపల్లె, పుట్టవారిపల్లె గ్రామాల్లో కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని స్పష్టమైందని, కంభంవారిపల్లె నివేదిక రావాల్సి ఉందని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై వెల్లడించారు.

ఈ పరిణామాలపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తమ ప్రాంతంలో కోళ్లు గానీ, ఇతర పక్షులు గానీ అసాధారణ రీతిలో మరణిస్తే వెంటనే 70139 14401 లేదా 93982 62752 నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు.

మరోవైపు బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ కోళ్ల నుంచి మనుషులకు సోకే అవకాశాలు చాలా అరుదని స్పష్టం చేశారు. అయితే, మాంసాన్ని 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించి తినడం సురక్షితమని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా, వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు కనీసం 10 రోజుల పాటు కోడిమాంసం, గుడ్లకు దూరంగా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు.

అంబటి రాంబాబుకు బిగుస్తున్న ఉచ్చు

నేడు నాలుగు పిటిషన్లపై కోర్టు విచారణ.. రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలింపు!

పీటీ వారెంట్ పై నేడు తీర్పును వెలువరించనున్న గుంటూరు కోర్టు
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, పాత కేసులు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి

గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ధర్నా చేసిన సమయంలో…. బారికేడ్లను తోసుకుంటూ, పోలీసులతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి అంబటిని విచారించేందుకు పట్టాభిపురం పీఎస్ పోలీసులు గుంటూరు కోర్టులో నిన్న పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్ పై కోర్టు ఈరోజు తీర్పును వెలువరించనుంది. అంబటిపై మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ అన్ని కేసుల్లో ఆయనపై పీటీ వారెంట్లు దాఖలు చేసే అవకాశం ఉంది.మరోవైపు, చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో గుంటూరు కోర్టులో అంబటి బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కూడా ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. దీనికి తోడు అంబటి పోలీస్ కస్టడీ పిటిషన్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదనపు సౌకర్యాల కోసం వేసిన పిటిషన్లపై కూడా ఈరోజు విచారణ జరగనుంది. అంబటికి సంబంధించిన నాలుగు పిటిషన్లపై విచారణ ఉండటంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరాలి


-అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి: ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు చేరవేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో ఆయన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు. 10 సూత్రాల అమలు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ఆదాయ శాఖ, పెట్టుబడులు, పి పి ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సోమవారం ఉదయం సమీక్షించారు. రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా సాంకేతికతతో పాటు అవేర్ డేటాలి పాలనలో ఏఐ టూల్స్ వినియోగం కేంద్ర ప్రాయోజిత పథకాల యాక్షన్ ప్లాన్ యువతకు నైపుణ్యాభివృద్ధి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్యుర్ విధానం అమలపై ఆయన అధికారులతో చర్చించారు.
అధికారులకు దిశా నిర్దేశం :
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గతంలో జిల్లా కలెక్టర్ల సదస్సులు నిర్వహించేవారు కాదు. ఇప్పుడు మూడు నెలలకోసారి నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల రెండుసార్లు మంత్రివర్గ భేటీ జరుగుతోంది. నెలవారీగా అధికారులు సమీక్ష జరుపుకోవాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు సమర్థంగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళుతోందని, ఆదిశగా అడుగులు వేస్తున్నాం. అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటర్ శంకుస్థాపన చేశామన్నారు. డేటా సెంటర్లతో పెను మార్పులు వస్తాయని చెప్పారు. శాఖల వారీగా పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు .

ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి

0


ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

విశాలాంధ్ర- ఉరవకొండ: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవనాధారమని, ఇందులో మార్పుల పేరుతో కార్మికుల హక్కులను హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం వంటి చర్యల వల్ల అనేక మంది కూలీలు పని దొరకక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వృద్ధులు, మహిళా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కూలీలకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడమే కాకుండా పనిదినాలను కూడా తగ్గిస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పని కల్పించడమే కాకుండా, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని సిపిఐ డిమాండ్ చేసింది. పథకాన్ని బలహీనపరచే అన్ని మార్పులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పాత విధానాలనే కొనసాగిస్తూ పేదల జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గన్నేమోహన్, వజ్రకరూరు కార్యదర్శి హసేన్ భాష, పార్టీ సీనియర్ నాయకులు పురిడి తిప్పయ్య, మహిళా సమైక్య నాయకురాలు నూర్జహాన్ బేగం, ఎఐటియుసి నాయకులు, చక్రధర్, గణప వీరభద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.

దిల్లీ లోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు

0

డాగ్ స్క్వాడ్ తో కలిసి నిర్వహిస్తున్న బాంబు డిస్పోజబుల్ విభాగం


న్యూదిల్లీ :
దేశ రాజధాని బాంబుల బెదిరింపుతో మరొక్కసారి ఉలిక్కిపడింది. 10 పాఠశాలలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయని ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. డాగ్ స్క్వాడ్ తో కలిసి బాంబు డిస్పోజబుల్ విభాగం ఆయా ప్రాంతాలకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డి ఎఫ్ ఎస్ అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆయా పాఠశాలలను ఖాళీ చేయించినట్లు వారు పేర్కొన్నారు.