Home Blog Page 902

ప్రతి ఒక్కరూ మానవ సేవను అలవర్చుకోవాలి..

కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం : ప్రతి ఒక్కరూ మానవసేవను అలవర్చుకోవాలని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను వైద్యులు, నర్సుల చేతుల మీదుగా అందజేశారు. తదుపరి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నామా ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి ఈ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి సేవా సమితి వారే దాతగా వ్యవహరించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న ఇటువంటి సేవలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు సహాయకులకు వీరి సేవ వరంగా మారిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరఫున వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న డీసీఎంఎస్ చైర్మన్

విశాలాంధ్ర -వెలిగండ్ల: శ్రీశైలంలో వెలసి ఉన్న శ్రీమల్లిఖార్జున స్వామి వారి సన్నిధి లో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని డీసీఎంస్ చైర్మన్ శ్యామల కాశీరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకట రెడ్డి,నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి,మండల టీడీపీ నాయకులు కీసరి రమణారెడ్డి, విలేఖరి మధు ఉన్నారు ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మాట్లాడుతూ దేవుని దర్శనం చాలా బాగా జరిగిందని మల్లికార్జున స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.

చాట్ జీపీటీపై ఆల్ట్ మన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు

చాట్ జీపీటీతో పంచుకునే విషయాలు రహస్యంగా ఉండవని వెల్లడి
అవసరమైతే బయటకు చెప్పేస్తుందన్న సీఈవో
చాట్ జీపీటీపై ఆ కంపెనీ సీఈవో శామ్ ఆల్ట్ మన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చాట్ జీపీటీ అంత నమ్మదగిన టెక్నాలజీ కాదని వ్యాఖ్యానించి చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూజర్లు చాట్ జీపీటీతో పంచుకునే విషయాలు రహస్యంగా ఉండవంటూ ఆల్ట్ మన్ బాంబు పేల్చారు. అవసరమైన సందర్భంలో బయటకు వెల్లడిస్తామని, ముఖ్యంగా న్యాయపరమైన అంశాలలో రహస్యాలను కాపడలేమని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులకు లోబడి యూజర్లకు సంబంధించిన డేటాలోని ఏ విషయాన్నైనా వెల్లడిస్తామని తేల్చిచెప్పారు. చాట్ జీపీటీలో డిలీట్ చేసిన సందేశాలు, చిత్రాలకు సంబంధించిన అంశంలో.. న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమైతే వాటిని భద్రపరుస్తామని, లేదంటే 30 రోజుల తర్వాత వాటిని శాశ్వతంగా తొలగిస్తామని ఆల్ట్ మన్ వివరించారు.

తెలంగాణ‌లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

తెలంగాణ‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. ఇక ఆదిబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెండు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్జ్‌ జారీచేసింది. అదేవిధంగా నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్సాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హైదరాబాద్‌లో వర్షం జోరుగా కురుస్తున్నది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతున్నది. శనివారం ఉదయం నుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, నాంపల్లి, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, అమీర్‌పేట, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్‌, కొండాపూర్‌, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మణికొండ, నార్సింగ్‌, బండ్లగూడ, మెహిదీపట్నం, లంగర్‌ హౌస్‌, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లితోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించేందుకు నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి హైదరాబాద్ సహా నేడు వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా భారత్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (2025 జులై 25) ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్‌ బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ.1,00,470కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.92,090కు చేరుకుంది. ఇక వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,17,000గా ఉంది. ఇక 10 గ్రాముల ప్లాటినం ధర కూడా స్వల్పంగా తగ్గి రూ.38,880కు చేరుకుంది.


దేశంలోని వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు

చెన్నై: రూ.1,00,470బీ రూ.92,090బీ రూ.75,890

ముంబయి: రూ.1,00,470బీ రూ.92,090బీ రూ.75,350

ఢిల్లీ: రూ.1,00,620బీ రూ.92,240బీ రూ.75,470

కోల్‌కతా: రూ.1,00,470బీ రూ.92,090బీ రూ.75,350

బెంగుళూరు: రూ.1,00,470బీ రూ.92,090బీ రూ.75,350

హైదరాబాద్: రూ.1,00,470బీ రూ.92,090బీ రూ.75,350

కేరళ: రూ.1,00,470బీ రూ.92,090బీ రూ.75,350

పూణె: రూ.1,00,470బీ రూ.92,090బీ రూ.75,350

వడోదరా: రూ.1,00,520బీ రూ.92,140బీ రూ.75,390

అహ్మదాబాద్: రూ.1,00,520బీ రూ.92,140బీ రూ.75,390

Aదీచీ ఛానల్ ఫాలో అవ్వండి

వివిధ నగరాల్లో వెండి ధరలు (కిలో)

చెన్నై: రూ.1,27,900

ముంబయి: రూ.1,17,900

ఢిల్లీ: రూ.1,17,900

కోల్‌కతా: రూ.1,17,900

బెంగుళూరు: రూ.1,17,900

హైదరాబాద్: రూ.1,27,900

కేరళ: రూ.1,27,900

పూణె: రూ.1,17,900

వడోదరా: రూ.1,17,900

అహ్మదాబాదు: రూ.1,17,900

ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్

యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్తగా ప్రకటించిన రూల్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. యూపీఐ సేవలను మరింత విశ్వసనీయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తీర్చి దిద్దేందుకు ఎన్‌పీసీఐ ఈ కొత్త రూల్స్‌ను ప్రకటించింది. చెల్లింపులు అధికంగా జరిగే వేళల్లో ఆటంకాలు కలగొద్దనేది ఈ రూల్స్ వెనకున్న ప్రధాన ఉద్దేశం. కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఆటోపే చెల్లింపులు నిర్దిష్ట సమయాల్లోనే జరుగుతాయి. మునుపటిలా రోజంతా ఈ చెల్లింపులకు ఆస్కారం ఉండదు. ఆటో పేమెంట్స్, సబ్‌స్క్రిప్షన్స్, యూటిలిటీ బిల్స్, ఈఎమ్‌ఐ వంటి వాటన్నిటికీ ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. ఇవన్నీ తెరవెనుక జరిగే కార్యకలాపాలే. అయితే, ఆటోపేమెంట్స్‌కు ప్రత్యేక సమయాలు కేటాయించడం ద్వారా యూపీఐ వేదికపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆటోపే సేవను వినియోగించే వ్యాపారాలు తమ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1 నుంచి వినియోగదారులు యూపీఐ ద్వారా తమ అకౌంట్‌ బ్యాలెన్స్‌ను రోజుకు 50 సార్లు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనలు యూపీఐ సర్వీసును వినియోగించే వారందరికీ వర్తిస్తాయి. ఇక డిజిటల్ చెల్లింపులపై చార్జీల విధింపు గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థకు ఆర్థిక సుస్థిరత చేకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెల్లింపులకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఈ విధానం ఎక్కువ కాలం మనలేదని స్పష్టం చేశారు. ఏ సేవ అయినా సుస్థిరంగా కొనసాగాలంటే కొంత డబ్బు చెల్లించక తప్పదని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో యూపీఐ ఆధారిత చెల్లింపుల సంఖ్య మునుపెన్నడూ చూడని స్థాయికి చేరుకుంది. ఇందుకు కావాల్సిన మౌలిక వసతుల నిర్వహణను బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఎన్‌పీసీఐ భరిస్తున్నాయి. ఫలితంగా వినియోగదారులు ఉచితంగానే ఈ సేవలను పొందగలుగుతున్నారు.

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

బీఆర్ఎస్ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి.. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 356(2),353(దీ)352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు..

గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రి వర్గ సభ్యుల సమక్షంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్‌, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

ఆత్మహత్యల నివారణకు 15 సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు

దేశంలోని ప్రతి 100 ఆత్మహత్యలలో 8 మంది విద్యార్థులు

ఎన్‌సీఆర్బీ 2022 డేటా ఆధారంగా జారీ

విశాఖపట్నంలో నీట్ విద్యార్థి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశం

దేశంలోని విద్యా సంస్థల్లో ఆందోళనకరంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, మద్దతు అందించేందుకు ఉద్దేశించిన 15 సమగ్ర మార్గదర్శకాలను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ అకాడమీలు, హాస్టళ్లు సహా అన్ని విద్యా సంస్థలకూ వర్తిస్తాయి. విద్యా ఒత్తిడి, పరీక్షల భయం, సంస్థాగత మద్దతు లోపం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

తప్పనిసరి మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్
విద్యా సంస్థల్లో తప్పనిసరి మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు, నియంత్రణ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలిఁ అని సుప్రీంకోర్టులోని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పరీక్షల సమయంలో, విద్యా సంవత్సరం మార్పు సమయంలో చిన్న బ్యాచ్‌లకు ప్రత్యేక కౌన్సెలర్లు లేదా మెంటార్లను నియమించాలి. వారు గోప్యంగా మద్దతును అందించాలిఁ అని కోర్టు ఉద్ఘాటించింది.

కీలక మార్గదర్శకాల వివరాలు:
సుప్రీంకోర్టు జారీ చేసిన 15 మార్గదర్శకాలలో ముఖ్యమైనవి: మానసిక ఆరోగ్య శిక్షణ: బోధన, బోధనేతర సిబ్బంది అందరూ సంవత్సరానికి రెండుసార్లు తప్పనిసరి మానసిక ఆరోగ్య శిక్షణ పొందాలి. ఈ శిక్షణలో మానసిక సహాయం, ఒత్తిడి సంకేతాల గుర్తింపు, స్వీయ-హాని సందర్భాల్లో స్పందన, సరైన సహాయానికి రిఫరల్ ప్రక్రియలపై దృష్టి ఉంటుంది.

వివక్ష రహిత విధానం: విద్యార్థులతో సున్నితంగా, సమగ్రంగా వ్యవహరించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఫిర్యాదుల కమిటీ: లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఇతర ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలి. బాధిత విద్యార్థులకు తక్షణమే మానసిక-సామాజిక మద్దతు అందించాలి. సెన్సిటైజేషన్ కార్యక్రమాలు: తల్లిదండ్రులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు మానసిక ఆరోగ్య సాక్షరత, భావోద్వేగ నియంత్రణ, జీవన నైపుణ్యాలను విద్యా కార్యకలాపాల్లో భాగంగా చేర్చాలి.

సూసైడ్ హెల్ప్‌లైన్: టెలి-మానస్ వంటి జాతీయ సూసైడ్ హెల్ప్‌లైన్ నంబర్లను హాస్టళ్లు, తరగతి గదులు, సాధారణ ప్రాంతాలు, వెబ్‌సైట్లలో పెద్ద అక్షరాలతో స్పష్టంగా ప్రదర్శించాలి.వెల్‌నెస్ రికార్డులు: విద్యార్థుల మానసిక ఆరోగ్య రికార్డులను అత్యంత గోప్యంగా నిర్వహించాలి.

ఎన్‌సీఆర్బీ డేటా ఆధారంగా..
ఈ మార్గదర్శకాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) 2022 డేటా ఆధారంగా జారీ చేయబడ్డాయి. 2022లో దేశవ్యాప్తంగా నమోదైన 1,70,924 ఆత్మహత్యలలో 13,044 విద్యార్థులవి. అంటే ప్రతి 100 ఆత్మహత్యలలో 8 మంది విద్యార్థులు ఉన్నారని ఎన్సీఆర్బీ నివేదించింది. 2001లో ఈ సంఖ్య 5,425గా ఉండగా, 2022లో 2,248 మంది విద్యార్థులు పరీక్షలలో విఫలమైన కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గణాంకాలు విద్యా సంస్థల్లో ఉన్న సిస్టమాటిక్ లోపాలను స్పష్టంగా సూచిస్తున్నాయని కోర్టు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ కేసు నేపథ్యం
ఈ చారిత్రాత్మక తీర్పు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నీట్ కు సిద్ధమవుతున్న 17 ఏళ్ల విద్యార్థిని 2023 జూలై 14న ఆత్మహత్య చేసుకున్న కేసు సందర్భంగా వెలువడింది. ఆమె తండ్రి సీబీఐ దర్యాప్తు కోరగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2024 ఫిబ్రవరి 14న ఆ దరఖాస్తును తిరస్కరించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తండ్రి ఫిర్యాదుతో కోర్టు ఇప్పుడు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 , 141 ప్రకారం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు తగిన చట్టం రూపొందించే వరకు ఇవి చట్టంగా అమలులో ఉంటాయి. ఈ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రవీంద్ర ఎస్ భట్ నేతృత్వంలోని విద్యార్థుల మానసిక ఆరోగ్య జాతీయ టాస్క్ ఫోర్స్ పనిని మరింత బలపరుస్తాయని కోర్టు తెలిపింది.

కార్గిల్ విజయ్ దివస్ జరిగి సరిగ్గా ఈరోజుకు 26 ఏళ్లు

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఆ వీడియోను వాయుసేన తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొంది. 1999 మే ఉ జులై మధ్య భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ముజాహిదీన్ల ముసుగులో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన శత్రు సైన్యాలు కార్గిల్‌లో ఖాళీగా ఉన్న కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. వీరి ఆక్రమణను తెలుసుకున్న భారత సైన్యం ఃఆపరేషన్ విజయ్ఃను ప్రారంభించింది.

భారత సైన్యం ఎదురుదాడికి పాక్ సైన్యం బెంబేలెత్తి తోకముడిచి పారిపోయింది. పాక్ సైన్యాన్ని తరిమికొట్టినట్లు జులై 26న భారత సైన్యం ప్రకటించింది. ఇది జరిగి నేటికి సరిగ్గా 26 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహించుకుంటూ అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు.