బెంగుళూరు: అమెజాన్.ఇన్ 25 ఆగస్ట్ మొదలుకుని 31 ఆగస్ట్ 2023 వరకు తమ వ్యాపార కస్టమర్లు అందరి కోసం అమెజాన్ బిజినెస్, తమ ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ అయిన బిజినెస్ వాల్యూ డేస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఈవెంట్, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు అదనపు లాభాలను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్‌లు, గృహోపకరణాలు, వంటగదికి సంబంధించిన ఉపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, ఆఫీసు ఫర్నీచర్, సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ టివిలు వంటి మరెన్నో ఉత్పత్తులపై వారు అసమానమైన డీల్స్, ఆఫర్లను పొంది ఆనందించగలుగుతారు. ఎంటర్ప్రైజ్ కస్టమర్లు, రూ. 2500లు లేదా అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన తమ ప్రీపెయిడ్ ఆర్డర్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను రూ. 500 వరకు పొందగలుగుతారు.