Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఆర్‌ఈఏ ఇండియాగా ఇలారా టెక్నాలజీస్‌

హైదరాబాద్‌ ః భారతదేశపు సుప్రసిద్ధ డిజిటల్‌ రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్స్‌ హౌసింగ్‌ డాట్‌ కామ్‌, ప్రాప్‌ టైగర్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ నిర్వహిస్తున్న ఇలారా టెక్నాలజీస్‌ తమ బ్రాండ్‌ ఆర్‌ఈఏ ఇండియాను విడు దల చేసింది. ఈ బ్రాండ్‌, మాతృసంస్థ, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుప్రసిద్ధ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఆర్‌ఈఏ గ్రూప్‌ లిమిటెడ్‌ను ప్రతిబింబిస్తుంది. ఆర్‌ఈఏ గ్రూప్‌ తొలుత అంటే 2017లో ఆర్‌ఈఏ ఇండియా (గతంలో ఇలారా టెక్నాలజీస్‌ పీటీఈ లిమిటెడ్‌)లో పెట్టుబడులు పెట్టింది. ఈ వాటా 2020 నాటికి 61%కు చేరింది. ఆర్‌ఈఏ గ్రూప్‌లో మిగిలిన వాటాలో అధికశాతం న్యూస్‌ కార్ప్‌ కలిగి ఉందని ఆర్‌ఈఏ గ్రూప్‌ సీఈవొ ఓవెన్‌ విల్సన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img