Monday, January 30, 2023
Monday, January 30, 2023

ఆసియా పసిఫిక్‌ 5జి షిప్‌మెంట్స్‌లో అగ్రస్థానంలో వివో

హైదరాబాద్‌ : స్ట్రాటజీ అనలిటిక్స్‌ ప్రకారం, వినూత్న అంతర్జాతీయ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ అయిన వివో 2021 రెండో త్రైమాసి కంలో ఆసియా పసిఫిక్‌ 5జి షిప్‌మెంట్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రతీ ఐదు 5జి షిప్‌ మెంట్స్‌ లో ఒకటి వివో ఫోన్‌ గా ఉంది. దీని వార్షిక షిప్‌మెంట్‌ వృద్ధి 215 శాతంగా ఉంది. అగ్రగామి సాంకేతికత, అధిక-నాణ్యత వినూత్నతలు ఈ ఫోన్‌ ను ఈ ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌ గా చేశాయి. ఈ ఏడాది ఆరంభంలో వివో యావత్‌ ప్రపంచంలోనే శరవేగంగా వృద్ధి చెందుతున్న 5జి స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అయినట్లుగా స్ట్రాటజీ అనలిటిక్స్‌ గుర్తించింది. 2021 మొదటి త్రైమాసికంలో అది తన పటిష్ఠ స్థానాన్ని కొనసాగించింది. 5జి ప్రమాణాల్లో, కీలక సాంకేతికతల్లో గణనీయ ప్రగతి సాధించడం ద్వారా వినియోగదారులకు రకరకాల 5జి ఫోన్లను, మెరుగైన 5జి అనుభూతులను అందించేందుకు వివో కట్టుబడి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img