Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఇంటి పరిశుభ్రతపై డైసన్‌ గ్లోబల్‌ డస్ట్‌ అధ్యయనం

ముంబయి: తమ ప్రదేశాలను అత్యున్నతంగా శుభ్రపరచడంలో భారతీయులు ముందున్నారు. డైసన్‌ గ్లోబల్‌ డస్ట్‌ స్టడీ 20221 ప్రకారం 46% మంది భారతీయులు గణనీయంగా తమ క్లీనింగ్‌ కార్యక్రమాలను పెంచుకున్నారు. ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు భారతీయులు తమ ఇళ్లను వారానికి 5-7 సార్లు శుభ్రపరుస్తున్నారు. మొత్తం ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో ఇది చాలా ఎక్కువ. అయితే కనీకన్పించని ధూళి విషయంలో భారతీయులు పెద్దగా పట్టించుకోవడం లేదని ఈ నివేదిక చెపుతోంది. ఆ ధూళి కణాలు మన ఆరోగ్యంపై చూపే ప్రభావాన్నీ గుర్తించడం లేదని తేలింది. డైసన్‌ గ్లోబల్‌ డస్ట్‌ స్టడీ ప్రకారం భారతీయులు ఎప్పుడో కానీ తమ పరుపులను శుభ్రపరచడానికి ప్రాధాన్యతనివ్వడం లేదు. ఈ పరుపులు శుభ్రంగా ఉన్నట్లు కనబడినప్పటికీ, లక్షలాది ధూళి కణాలకు నిలయంగా ఈ పరుపులు ఉంటాయని డైసన్‌లో మైక్రోబయాలజీ రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా సేవలనందిస్తోన్న డెన్నీస్‌ మాధ్యూ అన్నారు. తడిగుడ్డ, క్లీనింగ్‌ వైప్స్‌ లేదంటే అడ్వాన్స్‌డ్‌ ఫిల్టేష్రన్‌తో వాక్యూమ్‌ క్లీనర్‌ వినియోగించి గోడల నుంచి డస్ట్‌ తొలగించాలి. పరుపులు మరియు వాషింగ్‌ షీట్స్‌, బ్లాంకెట్‌లను 145డిగ్రీల ఫారిన్‌ హీట్‌ లేదా 195డిగ్రీల ఫారిన్‌హీట్‌తో అలెర్జిక్‌ మెటీరియల్‌ పోగొట్టడంతో పాటుగా అలెర్జిన్స్‌ను తగ్గిస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img