Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఇండస్‌ వ్యాలీ బయో ఆర్గానిక్‌ కాంబో కిట్‌లు విడుదల

హైదరాబాద్‌ : ఇండస్‌ వ్యాలీ కాస్మోస్యూటికల్స్‌ ఆధ్వర్యంలోని ఇండస్‌ వ్యాలీ బయో ఆర్గానిక్‌, స్వయంగా ఇంట్లోనే సిద్దం చేసుకునే ఇరవై ఆరు రకాల్కెన ఉత్పత్తులను 100 శాతం సేంద్రీయంగా తయారైన డిఐవై కాంబో కిట్‌లను రూ.250 నుండి రూ.400 అందుబాటు ధరల శ్రేణితో ప్రవేశపెట్టింది. కస్టమర్ల కోసం చవకగా డిఐవై (డూ ఇట్‌ యువర్‌ సెల్ఫ్‌) ఉత్పత్తి శ్రేణిని రూపొం దించడం ద్వారా ‘‘అందాన్ని సురక్షితంగా, రసాయన రహితంగా మార్చడం’’పై కొనసాగుతున్న వారి మిషన్‌లో ఈ ప్రారంభం ఒక ముందడుగు కానున్నదని ఇండస్‌ వ్యాలీ కాస్మోస్యూటికల్స్‌, సిఇఒ, వ్యవస్థాపకుడు శ్యామ్‌ ఆర్య అన్నారు. ఈ ఉత్పత్తి అమేజాన్‌, 1ఎమ్‌జి, ఫ్లిప్‌కార్ట్‌, న్కెకా, స్నాప్‌డీల్‌, పేటిఎమ్‌ మాల్‌ మరియు మింత్రా వంటి ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img