Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

ఎన్‌బీఎఫ్‌కు.. సెల్ప్‌ రెగ్యులేటరీ బాడీ గుర్తింపు

న్యూదిల్లీ : న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ (ఎన్‌బీఎఫ్‌)ను సెల్ప్‌ రెగ్యులేటరీ బాడీగా గుర్తిస్తూ భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని ఎన్‌బీఎఫ్‌ సోమవారం ఒక పత్రికా ప్రకటనలో వెల్లడిరచింది. కేంద్ర ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఈ హోదా ద్వారా దేశం మొత్తం అక్రెడిటేషన్‌ పొందే ఏకైక సంస్థగా ఎన్‌బీఎఫ్‌ నిలిచిందని పేర్కొంది. ప్రొఫెషనల్‌ న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ప్రమాణాలకు అనుగుణంగా నడుస్తున్న కారణంగా తమకు ఈ దృవీకరణ దక్కిందని ఆ సంస్థ అధ్యక్షులు అర్నాబ్‌ గోస్వామి తెలిపారు. ఎన్‌బీఎఫ్‌ మీడియా ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద వార్తా ప్రసారక బృందంగా ఇది నిలిచిందని పేర్కొన్నారు. కఠినమైన పరిశీలన అనంతరం సెల్ప్‌ రెగ్యులేటరీ బాడీ గుర్తింపు పొందిన ఏకైక సంస్థగా నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడంలో తనతో పాటు కృషి చేసిన సిబ్బంది, సంస్థ పాలకమండలి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అత్యున్నత ప్రమాణాలతో బలమైన వ్యవస్థను నిర్మించడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ జయకృష్ణ మాట్లాడుతూ టీవీ న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్‌ల కోసం నమోదు చేసుకున్న సంస్థల్లో తమ సంస్థకు మొదటి అధికారిక గుర్తింపు లభించడం తమ భాద్యతను పెంచిందని పేర్కొన్నారు. తమ వార్తా ప్రసారాలను దేశంలోని వివిధ భాషల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img