ముంబయి: తొమ్మిది కొత్త మోడల్స్ విడుదలతో తమ వాటర్ ప్యూరిఫైర్స్ పోర్ట్ ఫోలియోల విస్తరణను భారతదేశపు ప్రముఖ వినియోగదారు డ్యూరబుల్స్ బ్రాండ్ ఎల్‌జీ తాజాగా ప్రకటించింది. వాటర్ ప్యూరిఫైర్స్ కొత్త శ్రేణి వినియోగదారుల కోసం స్వచ్ఛమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన త్రాగు నీటిని నిర్థారించే ఆధునిక ఫీచర్స్‌తో లభిస్తోంది. భారతదేశపు వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి కొత్తగా విడుదల చేయబడిన మోడల్స్ డబ్ల్యుడబ్ల్యు176జీబీఆర్‌బీ, డబ్ల్యుడబ్ల్యు176జీపీబీడబ్ల్యు, డబ్ల్యుడబ్ల్యు156ఆర్‌పీటీబీ, డబ్ల్యుడబ్ల్యు156ఆర్‌పీటీసీ, డబ్ల్యుడబ్ల్యు146ఆర్‌పీఎల్‌బీ, డబ్ల్యుడబ్ల్యు136ఆర్‌పీఎన్‌బీ, డబ్ల్యుడబ్ల్యు146ఆర్‌పీఎల్‌సీ, డబ్ల్యుడబ్ల్యు132ఎన్‌పీ, డబ్ల్యుడబ్ల్యు131ఎన్‌పీ రూపొందించబడ్డాయి. పరిశుభ్రత, ఆరోగ్యం, డిజైన్, సౌకర్యవంపై దృష్టి కేంద్రీకరణతో, ఈ వాటర్ ప్యూరిఫైర్స్ పరిశ్రమలో కొత్త కొల ప్రమాణాన్ని ఏర్పరిచే వినూత్నమైన ఫీచర్స్ శ్రేణిని అందిస్తాయి.