ముంబయి: ఐడీబీఐ బ్యాంక్ ‘‘సుగమ్ రిన్ భుగ్తాన్ యోజన (సుగమ్)’’ అనే ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ఇది మార్చి 31, 2021 వరకు రిటైల్ నికర నిరర్ధక ఆస్తులను ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా దాని రికవరీ ప్రయత్నాలను పెంచేందుకు, రుణగ్రహీత ప్రిన్సిపల్ రూ.0.10 కోట్ల కన్నా ఎక్కువ, రూ.10 కోట్ల వరకు (అర్హత ప్రమాణాలకు లోబడి) ఉంటుంది. కష్టాల్లో ఉన్న రుణగ్రహీతలకు పునరుద్ధరించబడిన అవకాశాన్ని అందించేందుకు, చట్టపరమైన చిక్కులను నివారించేందుకు, వారి బకాయిలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ పథకం సహకారాన్ని అందిస్తుంది.