Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

ఓయో బుకింగ్స్‌లో హైదరాబాద్‌కు మూడవస్థానం

న్యూఢల్లీి: భారతదేశం ప్రధాన కార్యాలయంగా, అతిపెద్ద హోటల్‌ వ్యవస్థగా నిలిచిన గ్లోబల్‌ ట్రావెల్‌ టెక్నాలజీ కంపెనీ ఓయో 35కు పైగా దేశాలలో విస్తరించి ఉంది. దేశవ్యాప్తంగా సంస్థ విస్తారమైన ఉనికిని బట్టి, దాదాపు ప్రతిచోటా ఓయో కనపడుతుంది. తొలిసారిగా, హైదరాబాద్‌ మొత్తం మీద అత్యధికంగా బుక్‌ చేయబడిన ఓయోల వివరాలను ఈ సంస్థ ప్రకటించింది. ఓయో సామాచార విశ్లేషణ ప్రకారం, ఢల్లీి ఎన్‌సీఆర్‌, బెంగళూరు తర్వాత భారతదేశంలో అత్యధికంగా బుక్‌ చేయబడిన మూడవ నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. బుకింగ్‌ విశ్లేషణ ప్రకారం, ఓయో9405 హోటల్‌ స్టే హోమ్‌, సిల్వర్‌ కీ ఎగ్జిక్యూటివ్‌ స్టే 28060, గచ్చిబౌలి, హైదరాబాద్‌లో అత్యధికంగా బుక్‌ చేయబడిన ఓయోలుగా నిలిచాయి. భారతదేశం అంతటా అత్యధికంగా బుక్‌ చేయబడిన టాప్‌ 10 ఓయోల జాబితాలో ఈ ప్రాపర్టీలు వరుసగా 7వ, 8వ స్థానంలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img