Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కాస్పర్‌ స్కైతో చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌

హైదరాబాద్‌ : భారతదేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారులకు తక్షణ భద్రత కల్పించేందుకు వీలుగా భారతదేశ ప్రీమియర్‌ కమ్యూనికేషన్స్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ భారతి ఎయిర్‌టెల్‌తో అంతర్జాతీయ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ కాస్పర్‌ స్కై భాగస్వామిగా మారింది. ఈ రెండు కంపెనీల మధ్య భాగస్వామ్యం ఎయిర్‌టెల్‌ వినియోగదారులు కాస్పర్‌ స్కై టోటల్‌ సెక్యూరిటీ సొల్యూషన్‌ను నేరుగా కొన్ని క్లిక్‌లతో ఎయిర్‌టెల్‌ నుంచి కొనుగోలు చేసేందుకు వీలు కల్పించింది. ఎయిర్‌టెల్‌ కస్టమర్లు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ తాజా వెర్షన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఈ కొనుగోలు చేయవచ్చు. అందుకు గాను వారు ఎయిర్‌ టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లోకి వెళ్లి ‘షాప్‌’ విభాగంలో లైఫ్‌స్టైల్‌ ఆఫర్లలో కాస్పర్‌ స్కై బ్యానర్‌ పై క్లిక్‌ చేయాలి. కార్డ్‌, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా చెల్లింపు చేయవచ్చు. సైబర్‌ ముప్పు పెరిగిన నేపథ్యంలో భారతీయ ఇంటర్నెట్‌ వినియోగదారులు సైబర్‌ సురక్షిత పాటించేందు కు వీలుగా సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం రూపుదిద్దుకుందని కాస్పర్‌ స్కై సీఈఓ యుగిన్‌ కాస్పర్‌ స్కై, భారతి ఎయిర్‌టెల్‌ సీఐఒ ప్రదీప్త్‌ కపూర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img